ఆగనంటున్న పూజా హెగ్డే.. మరో బిగ్ ప్రాజెక్ట్‌కు రెడీ!  

Pooja Hegde Signs Another Big Project-ala Vaikuntapuramulo,bachchan Pandey,bollywood Movie News,pooja Hegde

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న బ్యూటీ పూజా హెగ్డే తాజాగా అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకులను అలరించింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pooja Hegde Signs Another Big Project-Ala Vaikuntapuramulo Bachchan Pandey Bollywood Movie News

కాగా పూజా హెగ్డే ఇటు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుసబెట్టి సినిమాలు చేస్తోంది.

ఇప్పటికే అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘హౌజ్‌ఫుల్ 4’ సినిమాలో పూజా హెగ్డే ఒక హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కాగా, పూజా హెగ్డేకు మంచి గుర్తింపు లభించింది.ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌లో పూజా నటించనున్నట్లు తెలుస్తోంది.

అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘బచ్చన్ పాండే’ చిత్రంలో పూజా హెగ్డే రెండో హీరోయిన్‌గా ఎంపికైంది.

ఫర్హద్ సామ్జి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పూజా హెగ్డే మరోసారి బాలీవుడ్‌లో తన సత్తా చాటాలని చూస్తోంది.

కాగా అల వైకుంఠపురములో సినిమా సక్సెస్‌తో పూజా హెగ్డేకు తెలుగులో క్రేజీ ఆఫర్లు వస్తుండటంతో ఆమె ఫ్యా్న్స్ పండగ చేసుకుంటున్నారు.

తాజా వార్తలు

Pooja Hegde Signs Another Big Project-ala Vaikuntapuramulo,bachchan Pandey,bollywood Movie News,pooja Hegde Related....