టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి పూజా హెగ్డే.తెలుగులో దువ్వాడ జగన్నాథమ్ సినిమా నుంచి ఈమె పేట్ పూర్తిగా మారిపోయింది.వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.త్రివిక్రమ్ అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలతో సాలిడ్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ మంగళూరు భామ ఇప్పుడు తెలుగు లో ప్రభాస్ కి జోడీగా పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, అలాగే కుర్రహీరో అఖిల్ కి జోడీగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలు చేస్తుంది.
ఈ రెండు సినిమాల మీద మంచి పాజిటివ్ బజ్ ఉంది.వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.ఇదిలా ఉంటే మరో వైపు బాలీవుడ్ సల్మాన్ ఖాన్ తో సయ్యాటకి రెడీ అయిన పూజాహెగ్డే రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణవీర్ సింగ్ కి జోడీగా సర్కస్ అనే సినిమాకి ఒకే చెప్పేసింది.మరో వైపు అక్షయ్ కుమార్ కి జోడీగా ఒక సినిమాలో కనిపించబోతుంది.ఇలా వరుసగా నాలుగు హిందీ సినిమాలు లైన్ లో పెట్టి తెలుగు దర్శకులకి ఇప్పట్లో డేట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది.పవన్ కళ్యాణ్ కి జోడీగా హరీష్ శంకర్ సినిమాలో పూజాహెగ్డేని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యేసరికి చాలా సమయం పడుతుంది.ఇదిలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలు పెడుతుంది.అలాగే ఆసక్తి కలిగించే ఫోటోలు కూడా షేర్ చేస్తుంది.
తాజాగా సముద్రం ఒడ్డున గులకరాళ్లు ఏరుకుంటున్న ఫోటో ఒకటి పూజా షేర్ చేసింది.దీనికి మహా సముద్రం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నా.
మనం ప్రత్యేకమైన గులకరాళ్ళం.అవి, మనము సముద్రం నుంచే బయటకి వచ్చాం అని కామెంట్ పెట్టింది.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.