అరవింద సమేత తనకి జీవిత కాలం గుర్తుండిపోయే సినిమా అంటున్న పూజాహెగ్డే  

Pooja Hegde Shares Aravinda Sametha Movie, Tollywood, Telugu Cinema, South Cinema, Jr NTR, Trivikram Srinivas - Telugu @tarak9999, @trivikramin, Aravinda Sametha Movie, Jr Ntr, Pooja Hegde, South Cinema, Telugu Cinema, Tollywood, Trivikram Srinivas

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే.ఈ అమ్మడు ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

TeluguStop.com - Pooja Hegde Shares Aravinda Sametha Movie

అయితే తరువాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో నటించే అవకాశం రావడంతో ఉన్నపళంగా టాలీవుడ్ ని పక్కన పెట్టి బాలీవుడ్ చెక్కేసింది.అక్కడ చేసిన మొదటి సినిమా డిజాస్టర్ అవడంతో మరల దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది.

ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్ఠీఆర్ కి జోడీగా అరవింద సమేత సినిమాలో పూజా హెగ్డే టైటిల్ రోల్ అయిన అరవిందగా నటించింది.ఈ సినిమా ఒక్కసారిగా ఆమె ఇమేజ్ ని మార్చేసింది.

TeluguStop.com - అరవింద సమేత తనకి జీవిత కాలం గుర్తుండిపోయే సినిమా అంటున్న పూజాహెగ్డే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కథ మొత్తం అరవింద పాత్ర చుట్టూనే తిరగడంతో పూజా హెగ్డేకి నటిగా కూడా మంచి గుర్తింపుని ఈ సినిమా తీసుకొచ్చింది.తరువాత ఆల వైకుంఠపురంలో సినిమాలో మరోసారి నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.

ఇదిలా ఉంటే అరవింద సమేత సినిమా తనకెంతో ప్రత్యేకం అని ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

నటనలో పరిణతి సాధించడంతో పాటు తొలిసారి తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం మరచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని పేర్కొంది. ఎన్టీఆర్‌తో కలిసి తొలిసారి నటించడం గొప్ప అనుభూతిని పంచింది.మా ఇద్దరి ఎనర్జీలెవల్స్‌ ఒకటే కావడంతో తెరపై కెమిస్ట్రీ అద్భుతంగా పండిందనే ప్రశంసలొచ్చాయి.

అన్నింటికంటే ముఖ్యంగా నటిగా నాలోని కొత్త కోణాల్ని ఈ సినిమా ఆవిష్కరించింది.నటనపరంగా అరవింద సమేత నా కెరీర్‌లోనే ఉత్తమచిత్రమని చెప్పొచ్చు.

దర్శకుడు త్రివ్రిక్రమ్ ‌గారి ద్వారా ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకునే అవకాశం దొరికింది.అందుకే నా కెరీర్‌లో ఆ సినిమాకు ఎప్పుడు ప్రత్యేకస్థానం ఉంటుంది అని పూజాహెగ్డే చెప్పింది.

#@trivikramIn #Pooja Hegde #Jr NTR #@tarak9999 #AravindaSametha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pooja Hegde Shares Aravinda Sametha Movie Related Telugu News,Photos/Pics,Images..