అల్లు అర్హతో పూజా హెగ్డే డ్యాన్స్ వీడియో... అలా బయటకొచ్చిందిగా!

అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన అలా వైకుంఠపురములో ఈ సినిమా గురించి మనందరికీ తెలిసిందే.ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Pooja Hegde Shares Adorable Allu Arha Video On Occasion Of 2 Years Of Ala Vaikun-TeluguStop.com

ఇక ఈ సినిమా లోని ప్రతి ఒక్క పాట కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.ఇక ఈ సినిమాలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా వినిపించాయి.

మరీ ముఖ్యంగా చెప్పాలి అంతే ఆ సినిమాలో రాములో రాముల సాంగ్ అలాగే బుట్ట బొమ్మ సాంగ్ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కొద్ది రోజుల పాటు మార్మోగి పోయాయి.అంతే కాకుండా ఈ రెండు పాటలు యూట్యూబ్ లో రికార్డులను సృష్టించాయి.

ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్ తర్వాత పూజా హెగ్డే ని బుట్ట బొమ్మ అని పిలవడం మొదలుపెట్టారు.

ఈ పాటలకు డ్యాన్స్ స్టెప్పులు కూడా అదిరిపోయే విధంగా కొరియోగ్రఫీ చేశారు శేఖర్ మాస్టర్.ఇక యూట్యూబ్ లో సోషల్ మీడియాలో బుట్ట బొమ్మ, రాములో రాముల పాటకు సంబంధించిన కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి.

ఈ పాటలు విడుదలైన తర్వాత హిట్ టాక్ లో ఆ పాటను రీ క్రియేట్ చేస్తూ కొన్ని వందల, లక్షల వీడియోలు చేశారు.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు కూడా ఆ పాటలకు స్టెప్పులు ఇరగదీశారు.

ఇదిలా ఉంటే తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే వేసిన స్టెప్పులకు ఆమె పై పలువురు ప్రశంసల వర్షం కూడా గుప్పించారు.తాజాగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది.ఈ సినిమా విడుదల అయ్యి 2 ఏళ్లు అయిన సందర్భంగా పలు విషయాలను పంచుకుంది.నేను అల్లు అర్జున్ కలిసి చేసిన డాన్స్ ని చూశారు కదా! ఇప్పుడు ఇది కూడా చూడండి షూటింగ్ లో నా షాట్ కోసం వెయిట్ చేసే సమయంలో అల్లు అర్జున్ కూతురు అర్హతో డాన్స్ చేశాను.

మాకు తెలియకుండానే బుట్ట బొమ్మ స్టెప్పులను ఇద్దరు ముందే కనిపెట్టేశామేమో అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై పూజా హెగ్డే అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube