పూజా పాప పాటకి ఫిదా అవుతున్న అభిమానులు...  

Pooja Hegde Samajavaragamana Goes Viral In Social Media-pooja Hegde Latest News,pooja Hegde News,pooja Hegde Samajavaragama ,pooja Hegde Tollywood Actress,tollywood Actress

టాలీవుడ్ లో గ్లామర్ డాల్ పూజా హెగ్డే తాజాగా నటించిన టువంటి చిత్రం అల వైకుంఠపురంలో.ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.

Pooja Hegde Samajavaragamana Song Goes Viral In Social Media-Pooja Latest News Pooja Samajavaragama Tollywood Actress

ఎస్.థమన్ స్వరాలు సమకూర్చారు.అయితే ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా ఈ చిత్రంలో సిద్ శ్రీరామ్ పాడిన టువంటి సామజవరగమనా పాట ప్రేక్షకుల మనసులను దోచేసింది.

అయితే ఇటీవల కాలంలో ఈ చిత్ర విజయోత్సవ వేడుకలో పూజా హెగ్డే సామజవరగమన పాట స్టేజి మీద పాడిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో  బాగా వైరల్ అవుతోంది.

వచ్చీ రాని భాషలో పూజా హెగ్డే ఎంతో క్యూట్ గా ఈ పాటను పాడింది.దీంతో పూజా హెగ్డే అభిమానులు ఈ పాటకు ఫిదా అయిపోయి ఈమెను నెట్టింట్లో బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేకాక నీ గొంతు బాగుంది హీరోయిన్ గానే కాకుండా గాయనిగా కూడా ట్రై చెయ్ అంటూ పలువురు సలహాలు ఇస్తున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా సమాజవరగమన ఒరిజినల్ పాట ఇప్పటికే యూట్యూబ్లో 14 కోట్ల పైచిలుకు వ్యూస్ తో దూసుకుపోతోంది.అలాగే అల వైకుంఠపురంలో చిత్రం కూడా ఇప్పటికే దాదాపుగా 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బన్నీ కెరీర్ లోనే మంచి బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.ప్రస్తుతం పూజ హెగ్డే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న టువంటి జాన్ చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తోంది.

తాజా వార్తలు

Pooja Hegde Samajavaragamana Goes Viral In Social Media-pooja Hegde Latest News,pooja Hegde News,pooja Hegde Samajavaragama ,pooja Hegde Tollywood Actress,tollywood Actress Related....