ఆచార్యలో నటిస్తున్న విషయాన్ని లీక్ చేసిన పూజా హెగ్డే.. చిరంజీవి తర్వాత ఆమెనే

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది.

 Pooja Hegde Revealed Acharya Movie Secret-TeluguStop.com

దేవాలయాల పరిరక్షణ నేపధ్యంలో ఈ సినిమా కథాంశం ఉండబోతుందని ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ బట్టి తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలలో కనిపించబోతున్నాడు.

సెకండ్ ఆఫ్ రామ్ చరణ్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది.అతను కామ్రేడ్ సిద్దా అనే పాత్రలో సినిమాలో కనిపిస్తున్నాడు.

 Pooja Hegde Revealed Acharya Movie Secret-ఆచార్యలో నటిస్తున్న విషయాన్ని లీక్ చేసిన పూజా హెగ్డే.. చిరంజీవి తర్వాత ఆమెనే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నక్షలిజానికి బ్రహ్మనిజాన్ని లింక్ చేస్తూ ఈ సినిమా కాన్సెప్ట్ ని కొరటాల చెబుతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాకి మొదటి నుంచి లీకుల బెడద ఉంది.

ఈ సినిమా టైటిల్ విషయంలో కొద్ది రోజులు సస్పెన్స్ నడిచింది.

సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేద్దామని అనుకున్న సమయంలో చిరంజీవి నేరుగా ఓ ప్రీ రిలీజ్ వేడుకలో ఆచార్య సినిమా టైటిల్ రివీల్ చేసేశారు.ఇక తప్పనిసరి పరిస్థితిలో కొద్ది రోజుల్లోనే ఆ టైటిల్ మీద పోస్టర్ రిలీజ్ చేశారు.ఇక తరువాత ఫస్ట్ లుక్ రిలీజ్ కాకుండానే సినిమాలో చిరంజీవి లుక్ బయటకి వచ్చి వైరల్ అయ్యింది.

అలాగే సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న విషయాన్ని టీజర్ ద్వారా చెప్పాలని అనుకుంటే ఈ విషయాన్ని చిరంజీవి లీక్ చేసేశారు.ఇక చేసేదేం లేక ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.

ఇంతలో పూజా హెగ్డే తాజాగా ఈ విషయాన్ని లీక్ చేసింది.ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయాన్ని చెప్పేసింది.

అలాగే ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో కూడా తాను నటిస్తున్న విషయాన్ని ఆ మధ్య పూజా హెగ్డే లీక్ చేసింది.అలాగే టీజర్ రిలేజ్ గురించి కూడా పూజా పాప కొద్ది రోజుల క్రితం లీక్ చేసింది.

దీంతో పూజాహెగ్డే ని లీడ్ తీసుకున్న సినిమా దర్శకులు ముందుగానే ఆమెకి సీక్రెట్స్ రివీల్ చేయొద్దని చెప్పాల్సి వస్తుంది.

#Pooja Hegde #Koratala Siva #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు