పూజా హెగ్డేను ఎవరు పట్టించుకోవడం లేదట  

టాలీవుడ్‌లో ఈమద్య కాలంలో హీరోయిన్స్‌ ఇలా వచ్చి అలా వెళ్లి పోతున్నారు.కొందరు స్టార్‌ హీరోయిన్స్‌గా పేరు దక్కించుకున్నా కూడా ఎక్కువ కాలం ఆ హోదాలో కంటిన్యూ అవ్వలేక పోతున్నారు.

TeluguStop.com - Pooja Hegde Rakul Preeth Singh Spider Mahesh Babu

ఆమద్య రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఏ స్థాయిలో స్టార్‌ డం అనుభవించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒకానొక సమయంలో ఆమె మహేష్‌బాబుకు డేట్లు ఇవ్వలేక పోయింది.

ఆమెతో బ్రహ్మోత్సవం సినిమాకు చేయాలనుకున్న మహేష్‌ బాబు ఆ సినిమాకు డేట్లు ఇవ్వక పోవడంతో స్పైడర్‌కు చేశాడు.అంతటి క్రేజ్‌ను దక్కించుకున్న రకుల్‌ కేవలం మూడు ఏళ్లలో ఆ క్రేజ్‌ మొత్తం ఢమాల్‌ అంటూ పడిపోయింది.

TeluguStop.com - పూజా హెగ్డేను ఎవరు పట్టించుకోవడం లేదట-Movie-Telugu Tollywood Photo Image

ఇప్పుడు పూజా హెగ్డే టైం నడుస్తోంది.అమ్మడి టైం ఏ రేంజ్‌లో సాగిందో గత ఏడాది అంతకు ముందు సంవత్సరం చూస్తే అర్థం చేసుకోవచ్చు.అయితే ఈ అమ్మడి పరిస్థితి కూడా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాదిరిగా అయ్యేనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం ఈమె రాధే శ్యామ్‌ మరియు మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రాలను చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమాకు సంబంధించిన విడుదల తేదీలపై క్లారిటీ లేదు.ఇదే సమయంలో తదుపరి చిత్రాలకు ఎలాంటి చర్చలు కూడా లేవని తెలుస్తోంది.

బాలీవుడ్‌ నుండి చిన్నా చితకా ఆఫర్లు వస్తున్నాయి.కాని టాలీవుడ్‌లో మాత్రం ఈమెకు కొత్త ఆఫర్లు కనిపించడం లేదు.ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ కాంబో మూవీలో ఈమెను అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని జాన్వీ కపూర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.ఇక ఇతర సినిమాల్లో కూడా ఈమెకు పెద్దగా ఆఫర్స్‌ లేవు.దాంతో ఈమె వచ్చే ఏడాదిలో ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతుందేమో అంటూ ఫిల్మ్‌ మేకర్స్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

#MostEligible #Bramotsavam #Radheshyam #Mahesh Babu #Spider

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు