యోగా చేస్తూ హీట్ పెంచుతున్న బుట్ట బొమ్మ  

Pooja hegde, Tollywood actress, heroine, Yoga photos, tollywood, - Telugu Heroine, Pooja Hegde, Tollywood, Tollywood Actress, Yoga Photos

తెలుగు సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ “పూజ హెగ్డే” గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ప్రస్తుతం షూటింగులు లేకపోవడంతో సోషల్ మీడియా  మాధ్యమాల్లో బాగా యాక్టివ్ గా ఉంటోంది.

 Pooja Hegde Raising Heat With Her Yoga Photos

అంతేకాక తన బాడీ ఫిట్నెస్ కోసం యోగా మరియు జిమ్ వర్కౌట్లు చేస్తూ బాగానే కసరత్తులు చేస్తోంది.

ఐతే తాజాగా పూజా హెగ్డే యోగా చేస్తున్న సమయంలో  తీసుకున్న ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.

యోగా చేస్తూ హీట్ పెంచుతున్న బుట్ట బొమ్మ-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ ఫోటోలో పూజా హెగ్డే యోగాఆసనాలు వేస్తూ తన శరీ రాన్ని విల్లులాగా వంచేసింది.దీంతో పూజా హెగ్డే అభిమానులు ఈ ఫోటోలని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.అంతేగాక పూజా హెగ్డే చాలా న్యాచురల్ బ్యూటీ అంటూ అల వైకుంఠపురంలో అనే చిత్రంలో అల్లు అర్జున్ చెప్పినటువంటి “మేడం సార్… మేడం అంతే.” అనే డైలాగ్ వల్లిస్తున్నారు.కాగా ఈ ఫోటోని షేర్ చేసిన ఒక్క రోజులోనే దాదాపుగా తొమ్మిది లక్షల పైచిలుకు లైకులు వచ్చాయి అంటే సోషల్ మీడియా మాధ్యమాలలో పూజా హెగ్డే కి ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కేకే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నటువంటి రాధే శ్యామ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న మరో బాలీవుడ్ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

#Pooja Hegde #Heroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pooja Hegde Raising Heat With Her Yoga Photos Related Telugu News,Photos/Pics,Images..