జాన్ తో త్వరలో జాయిన్ అవుతున్న పూజా హెగ్డే  

అల వైకుంఠపురం సినిమాతో తన ఖాతాలో మరో హిట్ ని వేసుకున్న మంగళూరు భామ పూజా హెగ్డే.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ భామ వరుసగా స్టార్ హీరోలతో జత కడుతుంది.

TeluguStop.com - Pooja Hegde Prbhas Jhan Ala Vaikunta Puramulo

ప్రస్తుతం హిట్ తో మంచి జోష్ మీద ఉన్న ఈ భామ త్వరలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న జాన్ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.ఇదిలా ఉంటే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాకి సంబందించిన ఒక సమాచారం శుక్రవారం అభిమానులతో పంచుకుంటానని ట్వీట్ చేశాడు.

అయితే ప్రభాస్ చెప్పబోయే విషయం ఎంటా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సాహో సినిమాతో పాన్ ఇండియా మూవీ చేసిన ప్రభాస్ కి ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయింది.

బాలీవుడ్ లో సాహో మంచి హిట్ అయ్యి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చిన కూడా తెలుగు ప్రేక్షకులని మాత్రం మెప్పించలేకపోయింది.దీంతో ఈ సారి జాన్ సినిమాతో ఎలా అయిన హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న దీనికి సంబందించిన అప్డేట్ ఏంటి అనేది తెలియరాలేదు.దీంతో ఫాన్స్ ఆసక్తిగా సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.ఈ నేపధ్యంలో ఫాన్స్ అభ్యర్ధన మేరకు శుక్రవారం సినిమాకి సంబందించిన సమాచారం చెప్పబోతున్నాడు.ఇక పూజాహేగ్దే కూడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పూర్తి స్థాయిలో త్వరలో పాల్గొనే అవకాశం ఉంది.

#Pan India Movie #PrabhasReady #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు