'ఆచార్య' సినిమాలో నీలాంబరి పాత్రలో పూజ హెగ్డే !

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి స్తున్నాడు.

 Pooja Hegde Plays Neelambari Role In Acharya Movie-TeluguStop.com

చిరంజీవి 152 వ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఆచార్య సినిమాను కొరటాల శివ సామజిక అంశాలతో రూపొందిస్తున్నాడు.

 Pooja Hegde Plays Neelambari Role In Acharya Movie-ఆచార్య’ సినిమాలో నీలాంబరి పాత్రలో పూజ హెగ్డే -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు 45 నిముషాల పాటు ఉంటుంది.ఇందులో రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.

అయితే ఈ సినిమాలో పూజ పాత్రపై ఇప్పుడు ఒక వార్త మీడియాలో బయటకు వచ్చింది.ఆ పాత్ర పేరు నీలాంబరి అని తెలుస్తుంది.పూజ హెగ్డే రామ్ చరణ్ సరసన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కొద్దీ సమయం కనిపించి ప్రేక్షకుల్ని అలరించ బోతుంది.ఇందులో రామ్ చరణ్, పూజ హెగ్డే మీద ఒక సాంగ్ కూడా ఉంటుందట.

ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది.ఆచార్యలో పూజ హెగ్డే పాత్ర గురించి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

Telugu Acharya Movie, Chiranjeevi, Koratala Shiva, Neelambari Role, Pooja Hegde, Pooja Hegde Plays Neelambari Role In Acharya Movie, Ram Charan-Movie

ఈమె ఈ సినిమాలో గిరిజన యువతిగా కనిపించబోతుంది.ఉద్యమ స్పూర్తితో ఉండే మహిళగా రామ్ చరణ్ ను అనుసరించే పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.చూడాలి ఈ పాత్రలో పూజ హెగ్డే ఈ మేరకు అలరిస్తుందో అని.ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమా మే 13 న విడుదల అవ్వబోతుంది.

#Neelambari Role #Koratala Shiva #PoojaHegde #Chiranjeevi #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు