ఆ సినిమా దెబ్బతో బాలీవుడ్ అంటే భయమేసింది అంటున్న పూజా హెగ్డే

హీరోయిన్ గా ఎదగాలని అనుకునే అందాల భామలకు మొదటి సినిమా చాలా కీలకం.కానీ చాలా మంది హీరోయిన్లు కెరియర్ లో మొదటి సినిమా ఒక పీడకలగా మిగిలిపోతుంది.

 Pooja Hegde Open Up On Mohenjo Daro Movie Failure, Bollywood, Tollywood, Duvvada-TeluguStop.com

కొంత కాలం వారి కెరియర్ కి అడ్డంకిగా మారుతుంది.రెండో అవకాశం అందుకొని మళ్ళీ వారిని వారు ప్రూవ్ చేసుకొని స్టార్ట్ హీరోయిన్లుగా చాలా మంది భామలు గుర్తింపు తెచ్చుకున్నారు.

అలాంటి వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు.ఆమె అందాల పోటీలలో పాల్గొని తరువాత హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించినపుడు మొదటిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

మాస్క్ అనే సినిమాతో తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.దీంతో ఈ భామకి మరో అవకాశం రావడానికి రెండేళ్లు పట్టింది.

కోలీవుడ్ దూరం పెట్టిన టాలీవుడ్ లో ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో వచ్చింది.ఈ రెండు సినిమాలు ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.
అయితే అదృష్టం కొద్ది బాలీవుడ్ లో హృతిక్ రోషన్ కి జోడీగా మోహింజదారో అనే పీరియాడికల్ సినిమా చేసే అవకాశం సొంతం చేసుకుంది.ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మారి ఆమె హిందీ సినిమా అవకాశాలని మూసేసింది.

మరల తెలుగులో దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో దూసుకుపోతుంది.తన సినిమా కెరియర్ పై తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించింది.

ఎవరికైనా మొదటి సినిమా కచ్చితంగా ప్లస్ కావాలని అనుకుంటారు.అయితే నాకు మాత్రం హిందీలో చేసిన మొదటి సినిమా మోహింజదారో ఒక పీడకలని మిగిల్చింది.

బాలీవుడ్ అంటే భయపడిపోయేలా చేసింది.ఆ సినిమా ప్రభావం కొంత కాలం పాటు తనని బాధపెట్టింది.

తరువాత తెలుగు సినిమా మళ్ళీ నాకు సక్సెస్ అందించింది.అలాగే వరుస అవకాశాల నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం కల్పించింది.

మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్ లో సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటే దానికి కారణం టాలీవుడ్ లో నాకు లభించిన సక్సెస్ అంటూ చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube