మరో సారి హృతిక్ రోషన్ తో రొమాన్స్ చేయబోతున్న బుట్టబొమ్మ  

Pooja Hegde Once Again romance With Hrithik Roshan, Bollywood, South Heroines, Sanjay Leela Bhansali, Indian Cinema, Pooja Hegde - Telugu Bollywood, Hrithik Roshan, Indian Cinema, Pooja Hegde, Sanjay Leela Bhansali, South Heroines

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనదైన స్పీడ్ తో దూసుకుపోతున్న నటి పూజా హెగ్డే.ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాతో పాటు పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ లో ప్రభాస్ కి జోడీగా నటిస్తుంది.

TeluguStop.com - Pooja Hegde Once Again Romance With Hrithik Roshan

దీంతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.ఇదిలా ఉంటే రీసెంట్ గా తమిళ సినిమాకి కూడా అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.దీంతో పాటు హిందీలో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో జత కట్టబోతుంది.

TeluguStop.com - మరో సారి హృతిక్ రోషన్ తో రొమాన్స్ చేయబోతున్న బుట్టబొమ్మ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మొత్తానికి పూజా హెగ్డే కెరియర్ ఇప్పుడు సూపర్ సక్సెస్ తో వెళ్తుంది.నెంబర్ వన్ హీరోయిన్ గా మారాలనే ప్రయత్నంలో ఉన్న ఈ భామ డ్రీమ్ కి తగ్గట్లుగానే అవకాశాలు వచ్చి పడుతున్నాయి.

బాలీవుడ్ లో ఎప్పటి నుంచో పాగా వేయాలని అనుకుంటున్నా పూజా హెగ్డేకి అక్కడ మొదటి సినిమానే హృతిక్ రోషన్ లాంటి స్టార్ తో మోహింజదారో అనే పీరియాడికల్ ఫిక్షన్ కథతో ఎంట్రీ ఇచ్చింది.అయితే ఆ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ అయ్యింది.
తరువాత టాలీవుడ్ లో అవకాశాలు రావడంతో మరల ఇక్కడికి వచ్చి స్టార్ హీరోయిన్ చైర్ లోకి వచ్చేసింది .ఇదే సమయంలో బాలీవుడ్ లో అవకాశాలు పెంచుకొని ఏకంగా మూడు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి పూజాహెగ్డేకి హృతిక్ రోషన్ తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.సంజయ్ లీలా భన్సాలీ హృతిక్ రోషన్ తో హిస్టరీ కథాంశంతో పీరియాడికల్ మూవీ తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు.

ఈ కథలో హృతిక్ రోషన్ కి జోడీగా పూజాహెగ్డేని కన్ఫర్మ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.గతంలో మోహింజదారో సినిమాలో వీరి జోడీకి మంచి రెస్పాన్స్ రావడంతో మరల వారిద్దరిని రిపీట్ చేయాలని భన్సాలీ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.

త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

#SanjayLeela #Pooja Hegde #Hrithik Roshan #South Heroines

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pooja Hegde Once Again Romance With Hrithik Roshan Related Telugu News,Photos/Pics,Images..