పూజాను భరించడం మరీ భారం అవుతోందట  

Pooja Hegde Is The Highest Grossing Heroine Of Tollywood - Telugu Pooja Hegde, Pooja Hegde 3crores And Ependature 50 Lakhs Totall 3.5 For Movie, , Pooja Hegde Tollywood Number One Heroine, Tollywood Producers Huge Remunaration Give To Pooja Hegde

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే అనడంలో ఎలాంటి సందేహం లేదు.తనకున్న క్రేజ్‌తో వరుసగా స్టార్‌ హీరోల సరసన ఈ అమ్మడు నటిస్తోంది.

Pooja Hegde Is The Highest Grossing Heroine Of Tollywood

స్టార్స్‌తో నటించే అవకాశం దక్కించుకుంటున్న ఈ అమ్మడు భారీ పారితోషికంను కూడా డిమాండ్‌ చేస్తోంది.ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధికంగా పారితోషికం దక్కించుకుంటున్న హీరోయిన్‌గా పూజా హెగ్డే నిలిచింది.

ఈమె ప్రస్తుతం తన ప్రతి సినిమాకు మూడు కోట్ల వరకు డిమాండ్‌ చేస్తుందట.

పూజాను భరించడం మరీ భారం అవుతోందట-Movie-Telugu Tollywood Photo Image

  ప్రస్తుతం ఈమెతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు పారితోషికం విషయంలో రాజీ పడ్డారు.కాని ఈమెతో ఒప్పందం కుదుర్చుకుందామనుకుంటున్న నిర్మాతలు మాత్రం పారితోషికం చెప్పగానే బాబోయ్‌ అనేస్తున్నారు.మూడు కోట్లు మరియు ఇతర ఖర్చులు కలిపి 3.5 కోట్లు వస్తున్న నేపథ్యంలో మరో హీరోయిన్‌ను చూసుకోవడం బెటర్‌ అనే ఉద్దేశ్యంతో ఉన్నారు.టాలీవుడ్‌లో ఏ స్టార్‌ హీరోయిన్‌ కూడా మూడున్నర కోట్ల పారితోషికం తీసుకోలేదు.

ఇప్పుడు పూజా అంత డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో నిర్మాతలు ఆమెను సైడ్‌ చేస్తున్నారు.

  పారితోషికం విషయంలో అలాగే పూజా కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో ఆమె సినిమాలు దక్కించుకే అవకాశం తక్కువ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అసలు పూజా హెగ్డేను అంత ఖర్చు పెట్టి భరించే వారు ఎవరు అంటూ నిర్మాతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.బాలీవుడ్‌ తరహాలో ఇక్కడ పారితోషికం కావాలంటే మాత్రం కష్టం అని, పారితోషికం విషయంలో తగ్గక పోతే ఆమెకు భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నారు.

మరి పూజా ఈ విషయాన్ని గుర్తించి పారితోషికం విషయంలో కాస్త తగ్గుతుందా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pooja Hegde Is The Highest Grossing Heroine Of Tollywood Related Telugu News,Photos/Pics,Images..