ఆమెకు 10 రోజులకే కోటిన్నర ముట్టజెప్పారట  

Pooja Hegde In Harish Shanker Valmiki Movie-

ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా ఉన్న విషయం తెల్సిందే.ఈ అమ్మడు భారీ పారితోషికంను డిమాండ్‌ చేస్తున్నా కూడా దర్శక నిర్మాతలు ఈమె వైపే మొగ్గు చూపుతున్నారు.పూజా హెగ్డే తాజాగా ‘వాల్మీకి’ చిత్రంలో నటించేందుకు గాను ఓకే చెప్పింది.తమిళ మూవీ జిగార్తాండకు రీమేక్‌గా రూపొందుతున్న వాల్మీకి చిత్రంలో వరుణ్‌ తేజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు...

Pooja Hegde In Harish Shanker Valmiki Movie--Pooja Hegde In Harish Shanker Valmiki Movie-

హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రలో పూజా హెగ్డే కనిపించబోతుంది.

Pooja Hegde In Harish Shanker Valmiki Movie--Pooja Hegde In Harish Shanker Valmiki Movie-

వాల్మీకి చిత్రం కోసం పూజా హెగ్డే నుండి 10 రోజులు మాత్రమే డేట్లు తీసుకోవడం జరిగింది.ఆ పది రోజులకు గాను ఏకంగా కోటిన్నర రూపాయల పారితోషికంను పుచ్చుకుంటుంది.10 రోజులు షూటింగ్‌ లో పాల్గొని, విడుదల సమయంలో వారం రోజులు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఒప్పందం కుదుర్చుకున్నారు.తక్కువ నిడివి పాత్ర అయినప్పటికి చాలా ముఖ్యమైన పాత్ర అవ్వడం వల్ల పూజా హెగ్డే ఉంటేనే బాగుంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అనుకున్నారు.

పూజా హెగ్డే ‘వాల్మీకి’ చిత్రానికి ప్లస్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో కోటిన్నర అయినా ముట్టజెప్పి మరీ ఆమెను తీసుకోవడం జరిగింది.ఇటీవలే విడుదలైన వరుణ్‌ తేజ్‌ లుక్‌కు మంచి స్పందన వస్తుంది.ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా కాకుండా విలన్‌గా కనిపించబోతున్నాడు.తెలుగు సినిమాలకు చాలా విభిన్నంగా ఉండే వాల్మీకి చిత్రం తప్పకుండా తెలుగు వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.