ఆ హీరో కోసం పూజా హెగ్డేను దింపుతున్న డైరెక్టర్  

Pooja Hegde In Dulquer Salmaan Telugu Movie Hanu Raghavapudi - Telugu Dulquer Salmaan, Hanu Raghavapudi, Pooja Hegde, Tollywood News

టాలీవుడ్‌లో ముకుంద సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ పూజా హెగ్డే కొన్ని సినిమాల వరకు సక్సెస్‌ను అందుకోలేకపోయింది.కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన డీజే సినిమాలో నటించి అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది.

 Pooja Hegde In Dulquer Salmaan Telugu Movie Hanu Raghavapudi

ఇక ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కొత్త చిత్రంలో నటిస్తోంది.

అయితే ఓ యంగ్ హీరోను తెలుగులో పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్న చిత్ర యూనిట్, ఆ సినిమాలో హీరోయిన్‌గా పూజాను తీసుకోవాలని చూస్తోందట.

ఆ హీరో కోసం పూజా హెగ్డేను దింపుతున్న డైరెక్టర్-Gossips-Telugu Tollywood Photo Image

మలయాళంలో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను దక్కించుకున్న హీరో దుల్కర్ సాల్మన్‌ను తెలుగులో పరిచయం చేయాలని చూస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి.ఇప్పటికే దుల్కర్ మహానటి చిత్రంలో నటించినా, ఆ సినిమా క్రెడిట్ మొత్తం కీర్తి సురేష్ కొట్టేసింది.

దీంతో సోలో హీరోగా తెలుగులో నటించేందుకు ఇప్పుడు రెడీ అవుతున్నాడు.కాగా ఇప్పటికే దుల్కర్‌కు కథ వినిపించి ఓకే చేయించుకున్న హను, పూజాకు కూడా కథను వినిపించాలని చూస్తున్నాడు.

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా సినిమాలకు సంబంధించిన ఎలాంటి పనులు కూడా జరగడం లేదు.దీంతో లాక్‌డౌన్ ముగియగానే పూజా హైదరాబాద్ చేరుకుంటుందని, అప్పుడు ఆమెకు కథ వినిపించి ఓకే చేయించుకోవాలని చిత్ర యూనిట్ చూస్తోంది.

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుక హను అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.మరి ఈ సినిమాతో దుల్కర్ తెలుగులో సోలో హిట్ అందుకుంటాడా లేడా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pooja Hegde In Dulquer Salmaan Telugu Movie Related Telugu News,Photos/Pics,Images..