ఆ హీరోయిన్ రెమ్యునరేషన్‌కు పూజ చేస్తు్న్న నిర్మాతలు  

Pooja Hegde Hikes Remuneration For Her Craze-major,pooja Hegde,remuneration,telugu Movie News

అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో హాట్ ఫెవరెట్ బ్యూటీగా కొనసాగుతోంది.బన్నీతో చేసిన డీజే మూవీ సక్సెస్ ఆమెకు మంచి డిమాండ్‌ను తెచ్చిపెట్టింది.

Pooja Hegde Hikes Remuneration For Her Craze-Major Pooja Remuneration Telugu Movie News

ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది.ఇప్పటికే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోన్న పూజా హెగ్డే తాజాగా అల్లు అర్జున్‌తో కలిసి అల వైకుంఠపురములో సినిమాలో నటించింది.

ఈ సినిమాపై అమ్మడు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది.

ఇక బాలీవుడ్‌లోనూ పూజా హెగ్డేకు మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే హౌజ్‌ఫుల్ 4 సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం తన రెమ్యునరేషన్‌ పెంచినట్లు తెలుస్తోంది.తాజాగా అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘మేజర్’ అనే సినిమాను మహేష్ బాబు నిర్మిస్తు్న్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సిందిగా పూజా హెగ్డేను అడిగారట చిత్ర యూనిట్.ఇప్పటివరకు రూ.1.5కోట్లు – 2 కోట్లు మధ్య రెమ్యునరేషన్ తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా రూ.2.5 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తోందట.

పూజా హెగ్డేకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉండటంతో ఆమె చెప్పిన రేటుకు తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు.అయితే మహేష్ బాబు మాత్రం పూజా ప్లేస్‌ను వేరే హీరోయిన్‌తో భర్తీ చేయాలని చూస్తున్నారట.

ఏదేమైనా పూజా హెగ్డే తన రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా పెంచేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన‌గా మారింది.

తాజా వార్తలు