ఎంత బుట్టబొమ్మ అయితే మాత్రం.. అంత పారితోషికం పెంచితే ఎలా?

టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్లగా రానిస్తున్న వారిలో బుట్ట బొమ్మగా పాపులరైన పూజా హెగ్డే కూడా ఒకరు.తెలుగు పరిశ్రమలో ‘ఒక లైలా కోసం’ సినిమాలో హీరోయిన్ గా నాగ చైతన్య సరసన జత కట్టి తెలుగు ప్రేక్షకులను అలరించింది.

 Heroine Pooja Hegde Hikes Remuneration, Lockdown, Pooja Hegde, Filmmakers, Movie-TeluguStop.com

ప్రముఖ హీరోల సరసన నటించి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది పూజా హెగ్డే.
అయితే ఈ ఏడాది అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురంలో నటించి భారీ హిట్ కొట్టిన ఈ బుట్ట బొమ్మ ఆ హిట్ తర్వాత ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’, అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు చేయాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయాయి.

ఈ ఏడాది అలా వైకుంఠపురం హిట్ అవడంతోనో, లేక వరుస సినిమాలు చేతిలో ఉన్నాయన్న కారణంతోనో ఒక్కసారిగా తన పారితోషికాన్ని రెండు కోట్లకు పెంచేసింది ఈ బుట్టబొమ్మ.దీంతో ఎంత బుట్ట బొమ్మ అయితే మాత్రం అంత పారితోషికం పెంచితే ఎలా అని సినీ నిర్మాతలు అంటున్నారట.

ఇప్పటివరకు పూజా హెగ్డే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి నటించిన”సాక్ష్యం”సినిమాకి అత్యధికంగా 1.5 కోట్ల పారితోషికాన్ని తీసుకుంది.అలాగే అలా వైకుంఠపురం సినిమాలో తన పారితోషికాన్ని 1.4 కోట్లు తీసుకుంది.మిగతా అన్ని సినిమాలకు దాదాపు కోటి రూపాయలకు అటో ,ఇటు గానే తన పారితోషికం తీసుకుంటూ వచ్చేది.అయితే ప్రస్తుతం తన సినిమాలకు అమాంతంగా రెండు కోట్ల వరకు తన పారితోషికం పెంచడం ఏమిటని సినీ నిర్మాతలు ఆలోచిస్తున్నారు.
కరోనా సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్లు అన్నీ ఆగిపోయాయి.అయితే నిబంధనలను సడలించిన నేపథ్యంలో తిరిగి సినిమాలు చిత్రీకరణ జరుగుతున్నాయి.

అయితే కరోనా సమయంలో వారి పారితోషికాలను తగ్గించుకోవాలని కొంతమంది నటీనటులు నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో, పూజా హెగ్డే మాత్రం ఒక్కసారిగా తన పారితోషికాన్ని పెంచడంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.దీపం ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడిని పూజా హెగ్డే అనుసరిస్తుందేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube