మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే.. ఫ్లాపులొచ్చిన తగ్గని పూజా క్రేజ్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఫ్లాప్ సినిమాలు వస్తే ఆ హీరోయిన్ కెరియర్ అంతటితో ముగిసిపోతుంది.కానీ పూజ హెగ్డే విషయంలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నం.

 Pooja Hegde Got Another Crazy Offer To Act With Surya Details, Pooja Hegde, Tol-TeluguStop.com

ఈమె వరుస ఫ్లాప్ సినిమాలను మూట కట్టుకున్నా ఈమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

ఈ విధంగా వరుస ప్లాప్ సినిమాలు వచ్చిన ఈమెకు మాత్రం వరుస సినిమా అవకాశాలు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పటికే పూజా హెగ్డే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న జనగణమన సినిమాలో కూడా పూజా హెగ్డే నటిస్తున్నారు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వస్తే ఈమె సల్మాన్ ఖాన్ సరసన కబీ ఈద్ కబీ దివాలి.రణవీర్ సింగ్‏తో సర్కస్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా మరొక క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశాన్ని పూజా హెగ్డే కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Circus, Janaganamana, Kabhieid, Mahesh Babu, Offere, Pooja Hegde, Telugu,

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో నటించే అవకాశాన్ని పూజా హెగ్డే దక్కించుకుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించనున్నారని తెలుస్తోంది.

ఏది ఏమైనా పూజా హెగ్డే నిజంగానే గోల్డెన్ లెగ్ అని చెప్పాలి.ఇలా వరుస ఫ్లాప్స్ వచ్చినప్పుడు హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి కానీ పూజ హెగ్డే మాత్రం అంతకుమించి అవకాశాలను అందుకుని దూసుకు పోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube