ప్రభాస్ కోసం భారీగా ఇవ్వనున్న పూజా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రభాస్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Pooja Hegde Gives Bulk Dates For Prabhas 20, Pooja Hegde, Prabhas, Prabhas 20, J-TeluguStop.com

ఇక సాహో చిత్రం తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఇది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాతో ప్రభాస్ మరోసాని పాన్ ఇండియా సక్సెస్‌ను అందుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.ప్రభాస్ లాంటి ఇంటర్నేషనల్ హీరో పక్కన చేయడానికి ఎంతో ఆసక్తిని చూపించింది ఈ బ్యూటీ.

ఇక ఈ సినిమా కోసం భారీ స్థాయిలో డేట్లను ఇచ్చిన పూజా హెగ్డే తన డేట్లన్నీ లాక్‌డౌన్‌లోనే ముగిసిపోతుండటం చాలా బాధాకరంగా ఉందని అంటోంది.అయితే ఈ సినిమా కోసం తాను ఏం చేయడానికైనా రెడీ అంటూనే, మరోసారి లాక్‌డౌన్ తరువాత బల్క్ డేట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

ఆమె నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ సినిమాతో పాటు బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సరసన నటించే సినిమాల డేట్లను అడ్జెస్ట్ చేసుకుంటూ ప్రభాస్ కోసం ఈ నిర్ణయం తీసుకుందట.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ లవ్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడు.

ఈ సినిమా షూటింగ్‌ను లాక్‌డౌన్‌కు ముందు యూరప్‌లో జరుపుకోగా, ఇప్పుడు లాక్‌డౌన్ తరువాత అక్కడ షూటింగ్ చేయడం కుదరదని, అందుకే హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాల్లో భారీ సెట్స్‌లోనే ఈ సినిమాను ముగించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube