ఆ విషయంలో పవన్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ !

పవన్ కళ్యాణ్ కు మొదటి నుండి ఒక అలవాటు ఉంది.తన తోటలో పండిన మామిడి పండ్లను తన స్నేహితులకు, బంధువులకు, సినీ ప్రముఖులకు పంపిస్తుంటారు.

 Pooja Hegde Follows Pawan Kalyan-TeluguStop.com

ఆ మామిడి పండు బాక్స్ అందుకున్న ప్రముఖులు కూడా చాలా ఆనందంగా ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుని ఫుల్ ఖుషీ అయిపోతుంటారు.పవన్ నుండి మామిడి పండు బాక్స్ అందిందంటే వారి ఆనందానికి అవధులు ఉండవు.

కానీ కరోనా పరిస్థితులు వచ్చిన అప్పటి నుండి పవన్ ఎవ్వరికి మామిడి పండ్ల బాక్స్ పంపించడం లేదు.పైగా ఈ సంవత్సరం పవన్ కూడా కరోనా బారిన పడడంతో ఈ ఆనవాయితీకి అడ్డు పడింది.

 Pooja Hegde Follows Pawan Kalyan-ఆ విషయంలో పవన్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇప్పుడు ఈ విషయంలో పవన్ ను ఫాలో అవుతుంది బుట్టబొమ్మ.పవన్ మామిడి పనుల బాక్స్ లను అందరికి పంపినట్టు ఇప్పుడు ఈ బ్యూటీ కూడా టాలీవుడ్ లో తనకు పరిచయం ఉన్న వారికీ తన తోటలోని మామిడి పండ్లను పంపిస్తుందని తెలుస్తుంది.

పూజ హెగ్డేకు బెంగళూరులో ఒక మామిడి తోట ఉందట.ఇప్పుడు ఆ తోటలోని పండ్లనే టాలీవుడ్ లోని ప్రముఖులకు పంపిస్తుందని ఈ బ్యూటీ మేనేజర్ తెలిపాడు.ఆయనే స్వయంగా ఈ మామిడి పండ్ల బాక్స్ లను టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులకు అందిస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఈ బ్యూటీ వరస ఆఫర్లతో బిజీగా ఉంది.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

ఇది ఇలా ఉండగా పవన్ కూడా నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఈ మధ్యనే కరోనా నుండి కోలుకున్న ఇంకా షూటింగ్స్ లో మాత్రం పాల్గొనడం లేదు. వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టడమే కాకుండా ప్రశంసలు కూడా అందుకున్నాడు.

ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.దీంతో పాటు ఒక రీమేక్ సినిమా కూడా చేస్తున్నాడు.

#Pawan Kalyan #PoojaHegde #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు