ఆ స్టార్‌ హీరోతో నటించి పెద్ద తప్పు చేశా

టాలీవుడ్‌లో ప్రస్తుతం పూజా హెగ్డే టాప్‌ హీరోయిన్‌.మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ వంటి స్టార్స్‌తో నటించింది, నటిస్తోంది, నటించబోతుంది.

 Pooja Hegde Feels Sad About Acting With Big Hero-TeluguStop.com

ఇంతటి క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌ సినిమాల సంఖ్య చూస్తే మాత్రం అంతా కూడా అవాక్కవ్వాల్సిందే.ఎందుకంటే ఈ అమ్మడు సినిమా కెరీర్‌ ప్రారంభించి దాదాపు ఏడు సంవత్సరాలు అయ్యింది.

కాని ఈ ఏడు ఏళ్లలో ఈమె కేవలం 8 సినిమాల్లో మాత్రమే నటించింది.ఈమె నటించిన 8 సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయి.

సంవత్సరానికి ఒక్కటి చొప్పునే పూజా హెగ్డే విడుదల చేయగలిగింది.అందుకు కారణం తాను చేసిన తప్పు అంటూ పూజా హెగ్డే తాను చేసిన తప్పును ఒప్పుకుంది.

టాలీవుడ్‌లో రెండు సినిమాలు చేసిన తర్వాత పలు చిన్న చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి.కాని పూజా మాత్రం బాలీవుడ్‌ ఆఫర్‌ అంటూ హృతిక్‌ రోషన్‌ సినిమా మొహెంజదారోలో నటించింది.ఆ సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాల పాటు డేట్లు ఇచ్చింది.అంతటి సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఆమె కెరీర్‌ అక్కడే చాలా వరకు ఆఫర్లు కోల్పోయింది.

ఒక హీరోయిన్‌ రెండేళ్ల కాలపరిమితిలో స్టార్‌డం ఉన్న సమయంలో అయితే ఆరు సినిమాల వరకు చేయవచ్చు.

మొహెంజదారో సినిమా వల్ల తన కెరీర్‌లో అయిదు ఆరు సినిమాలు మిస్‌ అయ్యాను అని, ఆ సినిమాను స్టార్‌ హీరో అని ఒప్పుకున్నాను.అది తప్పు అని నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది.ఇకపై తాను ఏ సినిమాకు కూడా ఎక్కువ డేట్లు ఇచ్చి సమయంను వృదా చేసుకోను అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు సక్సెస్‌ అయితే ఇప్పటికి అయినా ఈమె సినిమాల సంఖ్య పెరుగుతుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube