ఆ విషయంలో పూజా పాపపై మండి పడుతున్న మహేష్ భార్య....

ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ అలాగే వాటిని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతోంది.అయితే ప్రస్తుతం ఈ అమ్మడు నటించినటువంటి చిత్రాలు బాగానే హిట్ అవుతుండటంతో పారితోషికం విషయంలో కొంత బెట్టు చేస్తున్నట్లు సమాచారం.

 Pooja Hegde Expecting Huge Remuneration For Adivi Sesh Movie-TeluguStop.com

అంతేగాక ఇప్పటికే తన తీసుకున్నటువంటి పారితోషకానికి అదనంగా మరో 30 శాతం పెంచినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం గురించి పలు వార్తలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ తన చిత్రాలతో ఆకట్టుకొనేటువంటి హీరో అడవి శేష్ ఈసారి సరికొత్త కథనంతో ఓ పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు తమ సొంత బ్యానర్ అయినటువంటి జిఎంబి బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి చిత్రీకరణ మొదలు కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా మొదలు కాలేదు.

Telugu Adivi Sesh, Pooja Hegde, Poojahegde-Movie

అయితే ఈ చిత్రంలో నటించడానికి పూజా హెగ్డే ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రంలో అడివి శేష్ సరసన నటించేందుకు పూజా హెగ్డే దాదాపుగా 2.5 కోట్లకు పైగా పారితోషికం ఇవ్వాలని షరతు పెట్టిందట.దీంతో నమ్రత ఈ పారితోషికం విషయంలో మరోసారి ఆలోచించుకోవాలని సూచించినప్పటికీ  అసలు తగ్గేది లేదని పూజా తెగేసి చెప్పిందట.దీంతో పూజా హెగ్డే స్థానంలో మరో కొత్త హీరోయిన్ ను తీసుకుని తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి “జాన్” అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రం దాదాపుగా 60 శాతానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

 దీంతో దర్శకుడు కేకే రాధాకృష్ణ ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అలాగే పూజ హెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube