కరోనా ఎఫెక్ట్ కి డైట్ పక్కన పెట్టిన పూజా హెగ్డే  

Pooja Hegde Enjoying Eating Rice In Quarantine Times - Telugu Bollywood, Pooja Hegde,, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.అదే టైంలో బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు సొంతం చేసుకుంటుంది.

 Pooja Hegde Enjoying Eating Rice In Quarantine Times - Telugu Bollywood Cinema Tollywood

మంగళూరు భామ అయిన పూజాహెగ్డే ఇప్పుడు కరోనా కారణంగా ప్రభాస్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చి హోం క్వారంటైన్ లో ఉంది.ఇక ఈ భామ రెగ్యులర్ గా ఫిట్ నెస్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది.

తన బాడీ షేప్ పెర్ఫెక్ట్ గా ఉంచుకోవడానికి జిమ్ లలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది.అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఇంటికే పరిమితం కావడంతో వర్క్ అవుట్స్ అన్ని బంద్ అయిపోయాయి.

 Pooja Hegde Enjoying Eating Rice In Quarantine Times - Telugu Bollywood Cinema Tollywood

అయితే ఇంట్లో ఉండటంతో కుదురుగా ఉండలేక నోటికి పని చెబుతుంది.డైట్ ని పక్కన పెట్టి తనకి ఇష్టమైన వంటలు అన్ని చేసుకొని తినేస్తుంది.ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆమెనే నేరుగా వెల్లడించింది.డైట్ ను ఇంతకు ముందు ఫాలో అయ్యేదాన్ని.

కాని ఇంట్లో ఉంటున్న కారణంగా డైట్ ను పూర్తిగా పక్కకు పెట్టేసినట్లుగా చెప్పుకొచ్చింది.ఇంట్లో డైట్ పాటించక పోవడంతో పాటు వర్కౌట్స్ అస్సు చేయక పోవడంతో లావు పెరిగే అవకాశం ఉంది.

అయినా కూడా ఆమె మాత్రం ఈ పరిస్థితుల్లో డైట్ ను ఫాలో అవ్వడం తన వల్ల కావడం లేదని, తినే విషయంలో అదుపులో ఉండలేక పోతున్నట్లుగా సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తాజా వార్తలు

Pooja Hegde Enjoying Eating Rice In Quarantine Times Related Telugu News,Photos/Pics,Images..