నేను పాన్ ఇండియా స్టార్ అయిపోయా అంటున్న పూజా హెగ్డే

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి పూజా హెగ్డే.ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్, హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా పూజా హెగ్డే కొనసాగుతుంది.

 Pooja Hegde Dream Fulfilled As A Pan India Star-TeluguStop.com

తెలుగులో ఈమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్, రాధేశ్యామ్ సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి వెయిటింగ్ లో ఉన్నాయి.వీటిలో రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ మూవీ కోసం కూడా పూజా హెగ్డేని ఖరారు చేసారని టాక్ వినిపిస్తుంది.అలాగే సుమారు 9 ఏళ్ల తర్వాత మళ్ళీ కోలీవుడ్ లోకి ఇళయదళపతి విజయ్ కి జోడీగా పూజా రీఎంట్రీ ఇస్తుంది.

 Pooja Hegde Dream Fulfilled As A Pan India Star-నేను పాన్ ఇండియా స్టార్ అయిపోయా అంటున్న పూజా హెగ్డే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే హిందీలో మూడు సినిమాలని లైన్ లో పెట్టింది.అందులో ఒక సినిమాలో సల్మాన్ ఖాన్ కి జోడీగా పూజా కనిపించబోతూ ఉండటం విశేషం.

ఇదిల ఉంటే తాజాగా పూజా హెగ్డే తన మనసులోని మాటని బయట పెట్టింది.

Telugu Bollywood, Most Eligible Bachelor, Pan India Star, Pooja Hegde, Radheshyam Movie, Tollywood-Movie

తాను హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసినపుడు పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని ఉండేదని, ఆ క్రమంలో తమిళ్, తెలుగు తర్వాత హిందీలో హృతిక్ రోషన్ కి జోడీగా మొహింజదారో సినిమాలో ఆఫర్ వచ్చినపుడు దీంతో పాన్ ఇండియా స్టార్ గా తనకి గుర్తింపు వస్తుందని భావించానని పేర్కొంది.అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తన కల అలాగే ఉండిపోయిందని పేర్కొంది.అయితే ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ బాషలలో వరుస సినిమాలు చేస్తున్నా అని, అదే సమయంలో రాధేశ్యామ్ సినిమాతో పాన్ ఇండియా మూవీలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ పెంచుకున్నా అని పేర్కొంది.

పాన్ ఇండియా స్టార్ కావాలనే తన కల ఇప్పటికి నెరవేరిందని చెప్పుకొచ్చింది.అన్ని బాషలలో సినిమాలు చేయాలనే నా కోరిక తీరిందని పూజా హెగ్డే సంతోషం వ్యక్తం చేసింది.

#Pooja Hegde #MostEligible #Pan India Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు