ఐరన్ లెగ్ అన్నారు.. అలానే వరుస ప్లాప్ లు వచ్చాయ్.. కానీ మళ్లీ ఊహించని అవకాశం?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి పోతోంది పూజా హెగ్డే.

 Pooja Hegde Dubut Cannes 2022 Film Festival Details, Pooja Hegde, Tollywood, Debut Cannes 2022, Film Festival, Pooja Hegde Cannes Festival, Acharya, Radheshyam, Beast, Aishwarya Rai, Sonam Kapoor, Deepika, Priyanka Chopra-TeluguStop.com

ఒక వైపు టాలీవుడ్ లో మరో వైపు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.అయితే వరుస సినిమాల్లో నటించినప్పటికీ పూజా హెగ్డే కి మాత్రం బ్యాడ్ టైమ్ నడుస్తోంది.

ఎందుకంటే ఇటీవల కాలంలో ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ అవ్వడం లేదు.పూజా హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో పూజా హెగ్డే ప్రస్తుతం నిరాశలో ఉంది.

 Pooja Hegde Dubut Cannes 2022 Film Festival Details, Pooja Hegde, Tollywood, Debut Cannes 2022, Film Festival, Pooja Hegde Cannes Festival, Acharya, Radheshyam, Beast, Aishwarya Rai, Sonam Kapoor, Deepika, Priyanka Chopra-ఐరన్ లెగ్ అన్నారు.. అలానే వరుస ప్లాప్ లు వచ్చాయ్.. కానీ మళ్లీ ఊహించని అవకాశం-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం పూజా హెగ్డే కి కన్ఫామ్ అయినా రెండు సినిమాలలో ఒకటి మహేష్ బాబు సినిమా కాగా మరొకటి పవన్ కళ్యాణ్ సినిమా.ఈ సినిమాలతో పాటుగా బాలీవుడ్ లో మరొక పెద్ద సినిమాల్లో నటిస్తోంది.

ఒకవేళ ఆ సినిమాలు కనుక హిట్ అయితే బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే టాలీవుడ్ లో నటిస్తున్న రెండు సినిమాలు కూడా హిట్ అయితే పర్వాలేదు కానీ లేదంటే పూజా కెరీర్ డైలమాలో పడటం గ్యారెంటీ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే పూజా వరుసగా సినిమాలు ఫ్లాప్ అయిన మూడ్ లో ఉండగా అనుకోకుండా 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది.దీంతో ఇక అమ్మడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Telugu Acharya, Aishwarya Rai, Beast, Debut, Deepika, Festival, Pooja Hegde, Poojahegde, Priyanka Chopra, Radheshyam, Sonam Kapoor, Tollywood-Latest News - Telugu

ఈ నెల మే 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, కంగానా రనౌత్, సోనమ్ కపూర్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్ లు అక్కడికి చేరుకున్నారు.ఈ క్రమంలోనే పూజా కు కూడా అటువంటి అవకాశం దక్కడం విశేషం.అయితే, ఈ అరుదైన అవకాశం వస్తుందని అమ్మడు అస్సలు ఊహించలేదు.

Telugu Acharya, Aishwarya Rai, Beast, Debut, Deepika, Festival, Pooja Hegde, Poojahegde, Priyanka Chopra, Radheshyam, Sonam Kapoor, Tollywood-Latest News - Telugu

17, 18 తేదీల్లో పూజా కేన్స్‌లో సందడి చేయబోతోంది.ఈ నేపథ్యంలో పూజా ఆ 16వ తేదీన ఇండియా నుంచి పారీస్‌కు బయల్దేరనుంది.ఆ తర్వాత ప్రపంచంలోని టాప్ స్టార్లతో కలిసి పూజా విందులో పాల్గొననుంది.

అయితే మొదట్లో మొదట పూజా ని ఐరన్ లెగ్ అన్నారు.ఇప్పుడు మళ్ళీ వరుస ఫ్లాప్ లు వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇలాంటి మంచి అవకాశం వచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube