టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ బ్యూటీగా మారిన పూజా హెగ్డేను తమ సినిమాలో ఖచ్చితంగా పెట్టుకోవాలని ప్రతి ఒక్క స్టార్ హీరో అనుకుంటున్నారు.ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోలు తమ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేసుకుని సక్సెస్ కొట్టాలని రెడీ అయ్యారు.
కాగా ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది.
ఇప్పటికే బాలీవుడ్ కామెడీ సీక్వెల్ హౌజ్‌ఫుల్ 4లో ఒక హీరోయిన్గా పూజా హెగ్డే అక్కడి జనాలను మెప్పించింది.
ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని ఏకంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో నటించనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఎక్కువగా ముంబైలోనే ఉంటున్న పూజా, అక్కడ ఓ యంగ్ హీరోతో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ మెహ్రీ కొడుకు రోహన్ మెహ్రాతో పూజా చాలా క్లోజ్‌గా ఉంటుందని, వారిద్దరు కలిసి పార్టీలకు, పబ్‌లకు తిరుగుతున్నట్లు ముంబై మీడియా కోడై కూస్తోంది.
ఈ క్రమంలో వారిద్దరు డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే వారిద్దరు ప్రేమలో ఉన్నారని, అది ఎంతదూరం వెళుతుందో చూడాలి అని అక్కడి మీడియా అంటోంది.ఇక సినిమాల పరంగా పూజా హెగ్డే తెలుగులో ప్రభాస్ 20వ చిత్రంలో నటిస్తుండగా అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తోంది.