డేటింగ్‌పై నోరువిప్పిన పూజా

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌‌గా అందాల భామ పూజా హెగ్డే వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

ఈ బ్యూటీ ఉంటే తమ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని స్టార్ హీరోలు మొదలుకొని దర్శకనిర్మాతల వరకు కొరుతున్నారు.

దీంతో అమ్మడికి ఫుల్ డిమాండ్ వచ్చేసింది.టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ అమ్మడికి వరుసబెట్టి అవకాశాలు వస్తున్నాయి.

కాగా పూజా బాలీవుడ్‌లో ఓ ప్రముఖ నటుడి కొడుకుతో డేటింగ్ చేస్తుందనే వార్త తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకువస్తాయో అర్ధం కావడం లేదని, తనకు సినిమాలు చేసే ఆలోచన తప్ప ఇప్పుడు మరే ఇతర ఆలోచన లేదని పూజా చెప్పుకొచ్చింది.

అటు తనకు డేటింగ్ చేసే సమయం కూడా లేదని, ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని పూజా చెప్పుకొచ్చింది.ఇక ఇటీవల అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న ఈ బ్యూటీ, తన నెక్ట్స్ మూవీలతో బిజీగా ఉంది.

Advertisement
అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడా..? ఆయనను జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం....

తాజా వార్తలు