త్రివిక్రమ్ తో మూడో సినిమా... క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే  

Pooja Hegde Confirmed With Trivikram Next Movie, Tollywood, Telugu Cinema, Ala Vaikuntapuramlo Movie, Allu Arjun, Jr NTR ,pooja hegdhe,bollywood,tollywood,panindia,radheshyam - Telugu Ala Vaikuntapuramlo Movie, Allu Arjun, Jr Ntr, Pooja Hegde, Telugu Cinema, Tollywood, Trivikram Next Movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లో బ్లాక్ బస్టర్, అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా అల వైకుంఠపురంలో నిలిచిపోయింది.

TeluguStop.com - Pooja Hegde Confirmed With Trivikram Next Movie

ఈ సినిమాకి బన్నీని మరో రేంజ్ కి తీసుకెళ్లి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది.ఇక ఈ సినిమాలో పాటలైతే టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులని షేక్ చేసింది.

సోషల్ మీడియాలో అత్యధిక మంది వీక్షించిన పాటల జాబితాలో ఈ సినిమాలోనివే రెండు ఉన్నాయంటే ఎంత సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక టిక్ టాక్ వీడియోలలో బుట్టబొమ్మ సాంగ్ వరల్డ్ ఫేమస్ అయిపొయింది.

TeluguStop.com - త్రివిక్రమ్ తో మూడో సినిమా… క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇంత సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా టీం రీయూనియన్ సెలబ్రేషన్ ని అందరూ కలిసి తాజాగా చేసుకున్నారు.ఇక ఈ వేడుకలో అల్లు అర్జున్ తన కెరియర్ లో ట్రెండ్ సెట్ చేసే బ్లాక్ బస్టర్ మూవీ రావడానికి 20 ఏళ్ళు పట్టిందని, ఈ సినిమాతో ఆ కల నెరవేరిందని పేర్కొన్నారు.
.

ఇక ఈ వేడుకల సందర్భంగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన సంతోషాన్ని షేర్ చేసుకుంటూనే త్రివిక్రమ్ తో త్వరలో మూడో సినిమా ఉండబోతుందని చెప్పుకొచ్చింది.

ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలో కూడా పూజా హెగ్డేని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు క్లారిటీ వచ్చింది.ఇప్పటికే అరవింద సమేత సినిమాలో పూజాహెగ్డేని హీరోయిన్ గా తీసుకున్న త్రివిక్రమ్ సినిమా కథ మొత్తాన్ని ఆమె పాత్ర చుట్టూ నడిపించాడు.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న పూజాహెగ్డేకి అరవింద సమేతలో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది.ఈ సినిమా ఆమెకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది.ఇక అల వైకుంఠపురంలో కూడా ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంది.ఈ రెండు సినిమాలో పూజా తన రేంజ్ ని అమాంతం పెంచేసుకుంది.

బాలీవుడ్ లో ఏకంగా మూడు సినిమాలు ఒకే చేసేసింది.ఇక తెలుగులో పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ తర్వాత మరో సినిమా ఒప్పుకోలేదని, ఆమె ఫోకస్ అంతా బాలీవుడ్ మీద ఉందని టాక్ వచ్చింది.

అయితే త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలో తాను నటిస్తున్నా అని క్లారిటీ ఇవ్వడం ద్వారా ఆమె తెలుగు సినిమాలకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది.

.

#Pooja Hegde #Jr NTR #Allu Arjun #TrivikramNext

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు