పూజా హెగ్డే కెరీర్‌ ఖతమేనా... ఐరెన్‌ లెగ్‌ ముద్ర  

Is Pooja Hegde Career Close In Film Industry-hit Movies,maharshi,pooja Hegde,prabhas

‘ముకుందా’, ‘ఒక లైలా కోసం’ చిత్రాలతో హీరోయిన్‌గా తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఆ రెండు సినిమాలు కూడా పూజాకు పెద్దగా క్రేజ్‌ తెచ్చి పెట్టలేక పోయాయి. ఆ సినిమాలు పూర్తి కాగానే బాలీవుడ్‌కు ఈ అమ్మడు వెళ్లింది. మళ్లీ రెండేళ్లకు డీజే చిత్రంతో హాట్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది..

పూజా హెగ్డే కెరీర్‌ ఖతమేనా... ఐరెన్‌ లెగ్‌ ముద్ర-Is Pooja Hegde Career Close In Film Industry

డీజే చిత్రం సూపర్‌ హిట్‌ కాకున్నా ఒక మోస్తరు సక్సెస్‌ దక్కించుకోవడంతో పూజా హెగ్డేకు మంచి ఆఫర్లు వచ్చాయి. స్కిన్‌ షోకు ఏమాత్రం అడ్డు చెప్పని కారణంగా ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు క్యూ కట్టారు. బన్నీ తర్వాత ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, ప్రభాస్‌ ఇలా స్టార్స్‌ అంతా ఆమె వెంట పడ్డారు.

ఎన్టీఆర్‌తో ఈమె చేసిన అరవింద సమేత చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. పైకి చూస్తే బాగానే అనిపించినా కలెక్షన్స్‌ మాత్రం నిరాశ పర్చాయి. ఇక తాజాగా మహేష్‌ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం మహర్షిలో కూడా ఈమె నటించింది. మహర్షి చిత్రం కూడా ఆశించిన స్థాయిలో రాబట్టడం లేదు.

ఇక త్వరలోనే ప్రభాస్‌తో కూడా ఈమె చిత్రం రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పూజా హెగ్డేకు ఐరెన్‌ లెన్‌ అనే ముద్ర పడిపోయింది.

ఇప్పటి వరకు పూజా హెగ్డే ఒక్కటి అంటే ఒక్కటి కూడా కమర్షియల్‌ హిట్‌ను దక్కించుకోలేక పోయింది. ఆమద్య బెల్లంకొండ బాబుతో నటించిన చిత్రం కూడా బొక్క బోర్లా పడింది. దాంతో పూజా హెగ్డే కెరీర్‌ త్వరలోనే ముగిసే అవకాశం ఉందనే టాక్‌ సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. పూజా హెగ్డే స్టార్‌డం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాదిరిగా మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలి పోనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్‌తో నటిస్తున్న సినిమాతో పాటు బన్నీతో చేస్తున్న మరో సినిమా సక్సెస్‌ అయితే తప్ప పూజా కెరీర్‌ నిలబడటం కష్టం.