డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో పట్టుబడ్డ పూజా హెగ్డే కారు... అర్థరాత్రి మరో కారులో వెళ్లాల్సి వచ్చిందట  

Pooja Hegde Car Caught In Drunk And Drive-

ఈమద్య కాలంలో స్టార్స్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడటం చాలా కామన్‌ అయ్యింది. ఒకవేళ స్టార్స్‌ పట్టుబడకున్నా, వారు ప్రయాణిస్తున్న కార్లు అయినా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ప్రయాణిస్తున్న కారును పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులు ఆపేశారు..

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో పట్టుబడ్డ పూజా హెగ్డే కారు... అర్థరాత్రి మరో కారులో వెళ్లాల్సి వచ్చిందట-Pooja Hegde Car Caught In Drunk And Drive

ఆ సమయంలో పూజా కారు వెనుక సీటులో కూర్చుని ఉంది. పూజా వెనుక సీటులో స్నేహితులతో కలిసి కూర్చుని ఉండగా, ఆమె మేనేజర్‌ మాత్రం కారును తోలుతున్నాడు. మహర్షి ప్రీ రిలీజ్‌ వేడుకకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ జరిగింది.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతున్న సమయంలోనే పూజా హెగ్డే మేనేజర్‌ కాస్త తాగాడు. అతడు కారును డ్రైవ్‌ చేస్తూ ఉన్న సమయంలో పోలీసులు అతడిని ఆల్కహాల్‌ టెస్టు చేయగా అతడు మోతాదుకు మించి ఆల్కహాల్‌ తీసుకున్నట్లుగా వెళ్లడి అయ్యింది. దాంతో వెంటనే అతడి నుండి లైసెన్స్‌ను, కారును స్వాదీనం చేసుకున్నారు. కారులో ఉన్న పూజా హెగ్డే పది నిమిషాల్లో మరో కారులో వెళ్లి పోయింది.

మేనేజర్‌ ఆమెను మరో కారులో అక్కడ నుండి పంపించడం జరిగింది..

అర్థరాత్రి సమయంలో కారును రోడ్డు మీద నిలిపేసి హీరోయిన్‌ మరో కారు ఎక్కడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఆ సమయంలో పూజా హెగ్డేతో పాటు స్నేహితులు కూడా ఉన్నారని, వారంత కలిసి మరో కారులో హోటల్‌కు చేరుకున్నారని సినీ వర్గాల వారు చెబుతున్నారు.

మొత్తానికి రాత్రి సమయంలో పూజా హెగ్డే కాస్త ఇబ్బందికి గురి అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.