ముకుందా, ఒక లైలాకోసం చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమయంలో ఈమెను ఎవరు పట్టించుకోలేదు.రెండేళ్ల గ్యాప్ తీసుకుని డీజే చిత్రంతో వచ్చి తన అందాల ప్రదర్శణతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
డీజే చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.ఈమె తెలుగులో చేసిన సినిమాల్లో కొన్ని ఫ్లాప్ అయినా కూడా ఈమె క్రేజ్ సినిమా సినిమాకు పెరుగుతూనే వచ్చింది.
ఈ ఏడాది వచ్చిన అలవైకుంఠపురంలో చిత్రంతో ఒక్కసారిగా అలా అలా పైకి ఎగబాకింది.ప్రస్తుతం ఈ అమ్మడి పారితోషికం రెండు కోట్లుగా సమాచారం అందుతోంది.ఇంతటి భారీ పారితోషికం అందుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్స్ తక్కువ మంది ఉన్నారు.అందులో ఈమె ఒకరు.
తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈమె సినిమాలు చేస్తోంది.గత ఏడాది ఒక సినిమాతో వచ్చిన ఈ అమ్మడు ఈ ఏడాది మరో సినిమాకు కమిట్ అయ్యిందట.

హిందీలో ఈ అమ్మడు నటించబోతున్న సినిమాలో బికినీ వేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.తెలుగులో గతంలో డీజే చిత్రంలో ఈ అమ్మడు బికినీ వేసిన విషయం తెల్సిందే.మళ్లీ హిందీ సినిమాలో బికినీ వేయబోతుందట.అలాగే కాస్త రొమాంటిక్ సీన్స్‌లో కూడా నటించబోతుందట.అందుకు గాను ఈమె మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట.సాదారణంగా రెండు కోట్లు తీసుకునే ఈ అమ్మడు మరో కోటిని వాటి కోసం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.