బంగారు లేడీగా మారిన ఐరన్ లెగ్ బ్యూటీ  

Pooja Hegde Becomes Golden Leg With Fifth Consecutive Hit - Telugu Ala Vaikuntapuramulo, Gaddalakonda Ganesh, Housefull 4, Pooja Hegde, Telugu Movie News

అక్కినేని నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే తొలుత ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది.ఒక లైలా కోసం అటుపై వరుణ్ తేజ్‌తో ముకుంద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడమే కాకుండా బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మోహెంజొదారో సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలవడంతో ఈ బ్యూటీ పనైపోయిందని అనుకున్నారు అందరూ.

Pooja Hegde Becomes Golden Leg With Fifth Consecutive Hit

కానీ ఈ అమ్మడికి తన ట్యాలెంట్‌పై నమ్మకం ఉండటంతో బన్నీతో డీజే సినిమా అటుపై తారక్‌తో అరవింద సమేత చిత్రాలతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మారింది.అటుపై ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా సక్సెస్‌ సినిమాల్లో నటించడమే ఆమెకు మరింత పేరును తీసుకొస్తుంది.వరుసగా ఐదవ హిట్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పూజా హెగ్డే పేరు మారుమోగుతోంది.

తెలుగులో అరవింద సమేతతో మొదలైన ఆమె సక్సెస్ టూర్, మహర్షి, గద్దలకొండ గణేష్, హౌజ్‌ఫుల్ 4, అల వైకుంఠపురములో సినిమాలతో సాగుతోంది.ఇంకా చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్న ఈ బ్యూటీ కోసం స్టార్ హీరోలతో పాటు దర్శకనిర్మాతలు కూడా లైన్ కడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test