ఆ హీరో చెల్లెలిగా పూజా.. డైరెక్టర్ మైండ్ పోయిందా అంటూ ఫ్యాన్స్ ఫైర్..

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా పెద్దది.ఈ ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Pooja Hegde As Sister For Star Hero Venkatesh In That Film , Venkatesh , Pooja H-TeluguStop.com

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం కూడా అవసరం లేదు.వెంకటేష్ రెండు దశాబ్దాలుగా వెండి తెర మీద వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఈయనకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువ.

ఎందుకంటే వెంకటేష్ నటించే సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఎక్కువ కనెక్ట్ అవుతాయి.

అందుకే ఈయనకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఫాలోయింగ్ ఎక్కువ.ఈయన చేసిన సినిమాలు ఇప్పటికి ఎవర్ గ్రీన్ సినిమాలు చాలానే ఉన్నాయి.

ప్రెసెంట్ వెంకటేష్ ఫాలోయింగ్ కాస్త తగ్గినా ఈయన చేసే సినిమాలు మాత్రం అలరిస్తూనే ఉన్నాయి.సోలో హీరోగా చేస్తూనే మల్టీ స్టారర్ సినిమాల్లో కూడా నటిస్తూ వెంకటేష్ అలరిస్తున్నాడు.

ప్రెసెంట్ అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఎఫ్ 3 సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.

ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.

Telugu Anil Ravipudi, Bollywood, Daggubati, Farhad Sanji, Pooja Hegde, Poojahegd

ఇక వెంకటేష్ బాలీవుడ్ లో కూడా నటించడానికి రెడీ అయ్యాడు.ఈయన ఏకంగా సల్మాన్ ఖాన్ తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చాలా ఏళ్ల తర్వాత వెంకటేష్ హిందీలో నటించడానికి రెడీ అవుతున్నాడని సమాచారం.

సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దివాళీ సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు.

Telugu Anil Ravipudi, Bollywood, Daggubati, Farhad Sanji, Pooja Hegde, Poojahegd

ఫర్హద్ సంజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో రాబోతుంది.ఈ సినిమాలో కీలక పాత్రలో వెంకటేష్ నటిస్తున్నట్టు సమాచారం.సల్మాన్ ఈ రోల్ కోసం వెంకటేష్ ను కోరగా ఆయన ఓకే చెప్పారట.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డే కు వెంకటేష్ సోదరుడి పాత్రలో నటిస్తున్నాడట.ఈ విషయం విన్న నెటిజెన్స్ డైరెక్టర్ మైండ్ ఏమైనా దొబ్బిందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube