ప్రేరణగా మెస్మరైజ్ చేసిన పూజా పాప!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో సినిమాలో నటించి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

 Pooja Hegde As Prerna In Radhe Shyam, Pooja Hegde, Prerna, Radhe Shyam, Prabhas,-TeluguStop.com

ఇక ప్రస్తుతం పూజా హెగ్డే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి కావడంతో ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇప్పటికే రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా నుండి మరో అప్‌డేట్ కోసం చాలా రోజులుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.కాగా నేడు(అక్టోబర్ 13) పూజా హెగ్డే పుట్టినరోజు జరుపుకుంటుండటంతో ఈ సినిమా నుండి ఆమె పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను ప్రభాస్ రిలీజ్ చేశాడు.

ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర పేరు ‘ప్రేరణ’ అని చెబుతూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.వింటేజ్ లుక్‌లో ఉన్న పూజా హెగ్డే చాలా అందంగా ఉండటంతో ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అప్పుడే అందరిలో మొదలైంది.

ఇక ఈ పోస్టర్‌లో పూజా ఒక రైలులో ప్రయాణిస్తున్న దృశ్యం కనిపిస్తుంది.ఆమె ఎదురుగా ఓ వ్యక్తితో మాట్లాడుతుంది.

ఆ వ్యక్తి ప్రభాస్ లాగే కనిపిస్తున్నాడు.మొత్తానికి ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు పూజా హెగ్డే కూడా అంతే వింటేజ్ లుక్‌లో కనిపించనుందనే విషయం ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను రాధాకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube