మహేష్ బాబుకి జోడీగా మరోసారి పూజాహేగ్దే, రష్మిక  

Pooja Hegde And Rashmika Mandana Romance Again With Mahesh Babu For Next Movie - Telugu Mahesh Babu, Next Movie, Pooja Hegde And Rashmika Mandana, Tollywood

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లో పరశురాం దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి.

Pooja Hegde And Rashmika Mandana Romance Again With Mahesh Babu For Next Movie

ఇక సినిమాకి సంబందించిన కాస్టింగ్ సెలక్షన్ లో దర్శకుడు పరశురాం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇందులో మహేష్ బాబుకి జోడీగా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, ఈ నేపధ్యంలో వారిని ఎంపిక చేసే పని మొదలెట్టినట్లు టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త.

తాజాగా వినిపిస్తున్న వార్తల బట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న ఇద్దరు భామలని ఇందులో హీరోయిన్స్ గా తీసుకోవాలనే ఆలోచనలో పరశురాం ఉన్నట్లు తెలుస్తుంది.

పూజాహేగ్దే, రష్మిక మందనలని హీరోయిన్స్ గా ఫైనల్ చేసే ప్రయత్నం జరుగుతుందని సమాచారం.

ఈ ఇద్దరు భామలు ఇప్పటికే మహేష్ బాబుతో రొమాన్స్ చేసారు.పూజాహేగ్దే మహర్షి సినిమాలో మహేష్ తో ఆడిపాడింది.

ఇక రష్మిక మందన తాజాగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబుకి జోడీగా కనిపించింది.ఈ ఇద్దరు భామలకి గీతా ఆర్ట్స్ తో సక్సెస్ ట్రాక్ ఉంది.

ఈ నేపధ్యంలో మరో సారి వీరిని మహేష్ బాబు కోసం రిపీట్ చేస్తే సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని భావించి ఫైనల్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.అయితే ఈ విషయం అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ కాకున్న టాలీవుడ్ లో మాత్రం ఈ వార్త బలంగా వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pooja Hegde And Rashmika Mandana Romance Again With Mahesh Babu For Next Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test