మామయ్యను ఆకాశానికి ఎత్తిన బంటు

తన ప్రతి సినిమా వేడుకలో కూడా అల్లు అర్జున్‌ తన మామ మెగాస్టార్‌ చిరంజీవి గురించి ఏదైనా చిన్న మాట అయినా మాట్లాడుతూ ఉంటాడు.అలాగే నిన్న జరిగిన ఆల్‌ టైం సూపర్‌ హిట్‌ సక్సెస్‌ వేడుకలో కూడా మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్థావనను అల్లు అర్జున్‌ తీసుకు వచ్చాడు.

 Pooja Hegde Allu Arjun Chiranjeevi Alavaikuntapuramulo-TeluguStop.com

మీడియాతో మాట్లాడిన సందర్బంగా చిరంజీవి గారు ఈ చిత్రాన్ని విడుదలకు ఒక రోజు ముందు చూశారు.ప్రేక్షకులు ఎవరు లేకుండా ఒంటరిగానే సినిమాను ఆయన చూశారు.

సినిమా చూసి వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని చాలా నమ్మకంగా చెప్పాడు.ఆ సమయంలోనే ఈ స్థాయి వసూళ్లు వస్తాయని నమ్మకంగా ఆయన మాతో అన్నాడు.

మీరు మరీ అతిగా చెబుతున్నారు అంటూ నేను అన్నప్పుడు లేదు నాకు తెలుస్తుంది.ఇది ఖచ్చితంగా ఒక రేంజ్‌ మూవీలా నిలుస్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశారు.

ప్రేక్షకుల్లో చూస్తే వారి ఫీలింగ్‌ను బట్టి ఇలాంటి విశ్లేషణ చేయవచ్చు.కాని ఆయన ఒక్కడే సినిమా చూసి ఇలా చెప్పడం గ్రేట్‌ అన్నాడు.

Telugu Allu Arjun, Chiranjeevi, Tollywood Box-

చిరంజీవి గారు ఇందుకే కదా మెగాస్టార్‌ అయ్యింది అని నేను నాన్న తో అన్నాను అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.అల వైకుంఠపురంలో చిత్రం ఆల్‌ టైం రికార్డును దక్కించుకుంది.దాదాపు అన్ని ఏరియాల్లో కూడా నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది.ముఖ్యంగా ఓవర్సీస్‌ మరియు నైజాం ఏరియాలోల బన్నీ సాధించిన కలెక్షన్స్‌ స్వయంగా చిత్ర యూనిట్‌ సభ్యులకు కూడా చాలా షాకింగ్‌గా ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతటి విజయాన్ని చిరంజీవి మొదటే ఊహించడం ఆయన సీనియార్టికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube