నిర్మాతగా మారుతున్న బుట్టబొమ్మ… కన్నడంలో ట్రయిల్స్  

Pooja Hegde Turned As A Producer, Tollywood, Bollywood, Kannada Cinema, Mangalore, Low Budget movies - Telugu Bollywood, Kannada Cinema, Low Budget Movies, Mangalore, Pooja Hegde Turned As A Producer, Tollywood

టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలతో జత కడుతూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న మంగళూరు భామ పూజాహెగ్డే.సౌత్ లో ఇప్పటికే జెండా పాతేసి హిందీ సినిమాలపై దృష్టిపెట్టిన ఈ అమ్మడు అక్కడ కూడా ఏకంగా ఓ నాలుగు సినిమాల వరకు లైన్ లో పెట్టింది.అందులో చాలా వరకు స్టార్ హీరోలతోనే.ఇక తెలుగులో ప్రస్తుతం ఈ అమ్మడు ఓ వైపు అఖిల్ తో, మరో వైపు డార్లింగ్ ప్రభాస్ తో సినిమాలు ఫినిష్ చేసింది.

 Pooja Hegde Akhil Prabhas Kannada Movies

ఈ సినిమాలు చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి.ఇక వీటి తర్వాత ఈమె ఫోకస్ అంతా హిందీ సినిమాల మీదనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి వచ్చిన క్రేజ్ తో రెండు కోట్లకి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది.ఇక తన సంపాదనని మళ్ళీ సినిమాల మీదనే పెట్టడానికి పూజా హెగ్డే ఆసక్తి చూపిస్తుంది.

నిర్మాతగా మారుతున్న బుట్టబొమ్మ… కన్నడంలో ట్రయిల్స్-Movie-Telugu Tollywood Photo Image

దీనికోసం నిర్మాత అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటి దగ్గర ఫ్యామిలీతో గడుపుతున్న ఈ అమ్మడుకి కన్నడనాట తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేయాలని ఆసక్తి పుట్టింది.

దీంతో ఫీల్ గుడ్ లవ్ స్టొరీలు ఉన్న యువ దర్శకులు ఎవరైనా ఉంటే తనని సంప్రదించాలని పూజా పాప చెబుతున్నట్లు సమాచారం.ముందుగా కన్నడంలో నిర్మాతగా అడుగుపెట్టి అక్కడ మంచి సినిమాలు తీసి తరువాత ఇతర బాషల మీద కూడా దృష్టిపెట్టాలనే ఆలోచనతో ఉందని టాక్.

ఈ ప్రొడక్షన్ బాధ్యతలు అన్ని కూడా తండ్రి, సోదరుడుకి అప్పగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

#Mangalore

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pooja Hegde Akhil Prabhas Kannada Movies Related Telugu News,Photos/Pics,Images..