అతి చిన్న వయసులోనే దాదాపుగా టాలీవుడ్లోని ప్రముఖ హీరోల సరసన నటించిన పూజా హెగ్డే హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతుంది.అయితే తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇందులో భాగంగా నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.అయితే ఇందులో భాగంగా ఒక నెటిజన్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో నటించడం మీకు ఎలా అనిపించిందని అడిగాడు.
ఈ ప్రశ్నకు పూజా హెగ్డే సమాధానమిస్తూ ఆయనతో నటించడం తనకెంతో సంతోషంగా ఉందని మరియు మహేష్ బాబు వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు.అంతేగాక ఆయనకి ఎవరితో ఎలా మాట్లాడాలో మరియు ఎక్కడ అ వాయిస్ పెంచాలో ఎక్కడ తగ్గించాలో అనే విషయాలు చాలా బాగా తెలుసని అన్నారు.
అయితే తాజాగా ఈ అమ్మడు నటించిన హస్ ఫుల్ 4 చిత్రం మంచి హిట్ గా నిలిచింది.దీంతో మరో నెటిజన్ అక్షయ్ కుమార్ తో పనిచేయడం ఎలా అనిపించిందని అడగగా ఆయనది ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అని ఎప్పుడూ సరదాగా ఉంటారని అని పేర్కొంది.
అంతేగాక ప్రతీ ఒక్కరిని సమానంగా చూస్తాడని అన్నారు.
అయితే తే చివరిగా ఓ నెటిజన్ ఒకవేళ మీకు టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపోజ్ చేస్తే ఏమని సమాధానం ఇస్తారని అడిగాడు.ఇవే ప్రశ్నలు అంటూ అయినా ప్రభాస్ నాకెందుకు ప్రపోస్ చేస్తాడని, ఒకవేళ ప్రపోజ్ చేసినా దాని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంటుందని అన్నారు.అంతేగాక ఒక వేళ ప్రభాస్ నాకు ప్రపోజ్ చేస్తే నేను సమాధానం చెప్పలేనంటూ పూజా హెగ్డే సిగ్గు పడ్డారు.