ప్రభాస్ లవ్ ప్రపోజల్ పై క్లారిటీ ఇచ్చిన పూజ హెగ్డే... 

అతి చిన్న వయసులోనే దాదాపుగా టాలీవుడ్లోని ప్రముఖ హీరోల సరసన నటించిన పూజా హెగ్డే హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతుంది.అయితే తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది.

 Pooja Hegde About Prabhas Love Proposal Mahesh Babu-TeluguStop.com

 ఇందులో భాగంగా నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.అయితే ఇందులో భాగంగా  ఒక నెటిజన్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో నటించడం మీకు ఎలా అనిపించిందని అడిగాడు.

ఈ ప్రశ్నకు పూజా హెగ్డే సమాధానమిస్తూ ఆయనతో నటించడం తనకెంతో సంతోషంగా ఉందని మరియు మహేష్ బాబు వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు.అంతేగాక ఆయనకి ఎవరితో ఎలా మాట్లాడాలో మరియు ఎక్కడ అ వాయిస్ పెంచాలో ఎక్కడ తగ్గించాలో అనే విషయాలు చాలా బాగా తెలుసని అన్నారు.

అయితే తాజాగా ఈ అమ్మడు నటించిన హస్ ఫుల్ 4 చిత్రం మంచి హిట్ గా నిలిచింది.దీంతో మరో  నెటిజన్ అక్షయ్ కుమార్ తో పనిచేయడం ఎలా అనిపించిందని అడగగా ఆయనది ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అని ఎప్పుడూ సరదాగా ఉంటారని అని పేర్కొంది.

అంతేగాక ప్రతీ ఒక్కరిని సమానంగా చూస్తాడని అన్నారు.

Telugu Akshay Kumar, Lovepraposel, Mahesh Babu, Pooja Hegde, Poojahegde, Prabhas

అయితే తే చివరిగా ఓ నెటిజన్  ఒకవేళ మీకు టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపోజ్ చేస్తే ఏమని సమాధానం ఇస్తారని అడిగాడు.ఇవే ప్రశ్నలు అంటూ అయినా ప్రభాస్ నాకెందుకు ప్రపోస్ చేస్తాడని, ఒకవేళ ప్రపోజ్ చేసినా దాని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంటుందని అన్నారు.అంతేగాక ఒక వేళ ప్రభాస్ నాకు ప్రపోజ్ చేస్తే నేను సమాధానం చెప్పలేనంటూ పూజా హెగ్డే సిగ్గు పడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube