ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత మీకు అందరికి గుర్తుండే ఉంటుంది.ఈ సామెత ఖచ్చితంగా సరిపోతుంది పూజ హెగ్డే( Pooja Hegde ) కి.
ఎందుకంటే ఆమె ఇల్లు కట్టేసింది ముంబైలోని కాస్ట్లీ ఏరియా బాంద్రాలో ఒక మంచి ఇల్లు తీసుకుని దాని ఇంటీరియర్ వర్క్ కూడా ఫినిష్ చేయిస్తుంది.మరి ఇల్లు రెడీ అయిందిగా ఇక పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అంటూ సోషల్ మీడియాలో పూజా హెగ్డే పై సరదాగా కామెంట్స్ విసురుతున్నారు నెటిజన్స్.
అయితే నిప్పు లేనిదే పొగ రాదు విషయం లేనిదే వార్త రాదు అన్నట్టుగా పూజ హెగ్డే పెళ్లి గురించి ఇప్పుడు ఈ వార్త ఎందుకు వస్తుంది అంటే ఆమె చాలా రోజులగా బాలీవుడ్ నటుడైన రోహన్ మెహ్రా తో ప్రేమాయణం కొనసాగిస్తుంది.

కెరియర్ పరంగా చూస్తే పూజ హెగ్డే పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.తెలుగులో సాయి ధరం తేజ్, నాగచైతన్య )( Naga Chaitanyaసినిమాలకు సంబంధించిన డిస్కషన్ జరుగుతున్నాయి కానీ ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.అది జరుగుతుందన్న నమ్మకం కూడా ఎవరికి లేదు.
ఇది కాకుండా హిందీలో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్న వాటి గురించి ఎలాంటి బజ్ లేదు.అవి ఎప్పుడు విడుదలవుతాయో, విడుదల అయితే వాటి ఫలితం పూజా కి ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది ప్రశ్న తలెత్తుతుంది.
అందుకే ఎలాగో ఖాళీగా ఉంది పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని సరదాగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు నెటిజన్స్.

పైగా రోహన్ ( Rohan Mehra )కెరియర్ కూడా ఇప్పుడు అంతంత మాత్రం గానే ఉంది.ఇద్దరు ఖాళీగా ఉన్న ఇలాంటి టైంలో పెళ్లి చేసుకుంటే ఈ పర్సనల్ స్పేస్ బాగా ఉపయోగించుకోవచ్చు కదా అనేది వారి అభిప్రాయం.ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రోహన్ మరియు పూజ హెగ్డే విచ్చలవిడిగా కలిసి తిరుగుతున్నారు.
కావాలని పాపరాజీ కి ఫోటోలు కూడా ఇస్తున్నారు.మరి ఇంత హడావిడి చేస్తూ పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అనేది అందరి అభిప్రాయం.
ఇక కెరియర్ దాదాపు చరమాంకం కి చేరుకుంది ఇకనైనా పెళ్లి గురించి ఆలోచించి పూజ అని తెలుగువారి సైతం అడుగుతున్నారు.