వరుస ప్లాప్ లు... అయినా పూజ జోరు తగ్గక పోవటానికి గల కారణం...?

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ మోస్ట్ హీరోయిన్ ఎవరని అడిగితే ఠక్కున ముందుగా వినిపించే పేరు పూజా హెగ్డే. ఈ అమ్మడు ఏ సినిమా చేసినా అది హిట్టు.

 Pooja Hedge Back To Back Movies Details, Pooja Hegde, Pooja Hegde Movies, Pooja-TeluguStop.com

కాదు కాదు సూపర్ హిట్టు అనే రేంజ్‌లో క్రేజ్‌ను తన సొంతం చేసుకుంది.అయితే ఈ బ్యూటీ ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతూ కేవలం స్టార్ హీరోల సరసన మాత్రమే నటిస్తుంది.

అంతేకాదు రెమ్యునరేషన్తీ కూడా భారీ మొత్తంలో తీసుకుంటూ దర్శకనిర్మాతలఫేవరెట్ హీరోయిన్ అయ్యింది.దీనితో బాగా క్రేజీ పెరిగిపోయిన ఈమె కోసం టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎంతగా ఎదురుచూస్తుంటారో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఆమె టాలీవుడ్‌లో ఓ సినిమా ఒప్పుకుందంటే, అది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అనే భావన వారిలో ఏర్పడిపోయింది.అందుకే పూజా హెగ్డేకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తమ సినిమాల్లో నటింపజేయాలని దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తుంటారు.

ఇకపోతే దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ అయితే బీస్ట్ మూవీ ప్రమోషన్స్‌లో పూజాను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తారు.అంతేకాదు ‘పూజా మన కాజా’ అంటూ దిల్ రాజు చేసిన కామెంట్ సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

అయితే ఇదంతా కూడా పూజ సూపర్ ఫామ్ లో ఉన్నప్పటి మాటలు.ఎందుకంటె ప్రస్తుతం పూజా కెరీర్ పరంగా చూసినట్లయితే, ఆమె ఇటీవల నటించిన మూడు సినిమాలు కూడా వరుసగా ఫెయిల్యూర్లును అందుకున్నాయి.

దీంతో పూజ ఫ్లాప్ మూవీలతో హ్యాట్రిక్ అందుకుంది.అంతేకాదు పూజా నటించిన రాధేశ్యామ్, బీస్ట్, లేటెస్ట్ గా విడుదలైన ఆచార్య మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించడంలో అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.

దీంతో పూజాకు కష్టకాలం వచ్చిందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఇలాంటి సమయంలో కూడా పూజా మాత్రం తన జోరును కొనసాగిస్తుంది.

Telugu Acharya, Beast, Mahesh Babu, Pawan Kalyan, Pooja Hedge, Pooja Hegde, Radh

ప్రస్తుతం పూజ వరుస సినిమాలను లైన్‌లో పెడుతూ వస్తుంది.ఇప్పటికే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో పూజా హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది.ఇక పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రాబోయే సినిమాలోనూ హీరోయిన్ గ చేస్తున్నది పూజ.అంతేకాదు ఎఫ్3 సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కూడా పూజా కనిపించనుందనే టాక్ వినిపిస్తుంది.ఇది ఇలా ఉండగా ఈ అమ్మడు టాలీవుడ్లోనే కాకా బాలీవుడ్‌లోనూ తన దూకుడును చూపిస్తోంది.ఇప్పటికే రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘సర్కస్’ సినిమాలో పూజా హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాను జూలై 15న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసింది.

Telugu Acharya, Beast, Mahesh Babu, Pawan Kalyan, Pooja Hedge, Pooja Hegde, Radh

అంతేకాదు బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నారట పూజా.అంతే కాదు మే 12న జరగనున్న ఈ చిత్ర షూటింగ్‌లో పూజా జాయిన్ కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇలా వరుసగా ఫ్లాపులు వస్తున్నా, పూజా హెగ్డే మాత్రం తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు వరుస ప్లాప్ లను అందుకున్న పూజ తన కెరీర్ లో రాబోయే సినిమాలలో అయినా విజయం అందుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.మరి ఈ విషయంపై మీ అభుప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియాజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube