నాతో ఎవరూ లవ్ లో పడలేరంటున్న హీరోయిన్ డాటర్..  

ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్న చిత్రం జవానీ జానేమన్.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నితిన్ కక్కర్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత జాకీ బగ్నాని మరియు ఈ చిత్ర హీరో సైఫ్ అలీఖాన్ సంయుక్తంగా కలిసి నిర్మించారు.

TeluguStop.com - Pooja Bedi Daughter Alaya Comments

అయితే ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ సరసన సీనియర్ నటి టబు నటించగా, సైఫ్ అలీ ఖాన్ కూతురు పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ పూజ బేడి కూతురు అలాయా నటించారు.అయితే తాజాగా ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా అలాయా ఆంగ్ల పత్రిక నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా అలాయా కొన్ని ఆసక్తికర సంఘటనలు తన అభిమానులకు తెలిపారు.తాను ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు అయినప్పటికీ చాలా చిత్రాలకు అందరిలాగే ఆడిషన్లులో పాల్గొన్నానని, అంతేగాక ఎక్కడా కూడా తన తల్లి పేరు ప్రస్తావించలేదని అలాగే తన కుటుంబ సభ్యుల బ్యాక్ గ్రౌండ్ ను  ఉపయోగించుకొని అవకాశాలు తెచ్చుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది అలాయా.

అయితే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడగ్గా తన గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ తనతో లవ్ లో పడరని  అని చెప్పుకొచ్చింది అలయా.

అంతేగాక ఈ చిత్రం ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని కాబట్టి ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్లి చూడాలని కోరారు.అయితే ఈ చిత్రం ఈ నెల 31వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

#Jawani Janeman #Pooja Bedi News #Alaya Love News #Pooja Bedi #PoojaBedi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు