ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటున్న 'పొన్నియన్ సెల్వన్'

కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాను మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు.

 Ponniyin Selvan’s Two Days Collection In Usa Is Here, Usa, Ponniyin Selvan , M-TeluguStop.com

ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమాను ఎప్పటి నుండో తెరకెక్కించాలి అని అనుకున్న ఇప్పటికి అది సాధ్యం అయ్యింది.ఈ సినిమా సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా మౌత్ టాక్ ఎలా ఉన్న ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చినట్టు టాక్.ముందు నుండి బాగా ప్రొమోషన్స్ చేయడంతో అన్ని చోట్ల మంచి బజ్ తోనే రిలీజ్ అయ్యింది.

దీంతో ఈ సినిమా మొదటి రోజు బాగానే వసూళ్లు చేసింది.అలాగే వీకెండ్ కావడంతో శని, ఆది వారాలు కూడా ఈ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి.

ఈ సినిమాకు మరో బలమైన సినిమా పోటీ లేకపోవడం కూడా కలిసి వచ్చింది.

ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బాగానే అలరిస్తుంది అని తెలుస్తుంది.

తమిళ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్న ప్రకారం ఈ సినిమాకు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయని తెలుస్తుంది.

Telugu Jayam Ravi, Karti, Kollywood, Mani Ratnam, Maverickmani, Ponniyin Selvan,

రెండు రోజుల్లోనే ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ తో కలిపి 3 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించినట్టు చెబుతున్నారు.మరి ఇదే నిజం అయితే ఈ మధ్య కాలంలో తమిళ్ సినిమాల్లో భారీ రెస్పాన్స్ అనే చెప్పాలి.హైయెస్ట్ కలెక్షన్స్ అక్కడ సాదిస్తుండడంతో తమిళ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, శోభిత దూళిపాళ్ల వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.

చూడాలి మరి ఈ సినిమా మొత్తం ఎంత వసూళ్లు సాధిస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube