సిలిండరు పూజ చేసి ఓటేసేందుకు పోలింగ్ డే రోజు కూడా ఓటర్లను ఆకట్టుకునేలా నేతలు వినూత్న పద్ధతులు అనుసరిస్తున్నారు.హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఇవాళ ఉదయం గ్యాస్ సిలిండర్కి పూజలు నిర్వహించారు.సిలిండర్పై రూ.500 నోట్ పెట్టి అలంకరణతో పూజలు నిర్వహించారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే సిలిండర్ వస్తుందనే సందేశాన్ని ప్రజల్లోకి పంపేందుకు ఆయన ఇలా చేశారు.అనంతరం ఓటేసేందుకు వెళ్లారు.