సైనికుల్లా పోరాడి ఓడారట  

Ponnam Prabhakar Comments On Telangana Elections-telangana Muncipal Elections

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు హోరా హోరీగా సాగుతాయని అంతా భావించారు.కాని అనూహ్యంగా అన్ని చోట్ల కూడా టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది.

Ponnam Prabhakar Comments On Telangana Elections-Telangana Muncipal Elections

మెజార్టీ మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ దక్కించుకోవడంతో అంతా కూడా షాక్‌ అవుతున్నారు.కాంగ్రెస్‌ మరియు బీజేపీ ఎక్కడ కూడా సరైన సత్తా చాటలేక పోయాయి.

ఈ క్రమంలో ఓటమిపై విశ్లేషించేందుకు కాంగ్రెస్‌ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఆ సమావేశంలో పొన్నం ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల మాదిరిగా పోరాడారు.కాని అవతలి పార్టీ వారి కుయుక్తులతో ఓటమి పాలయ్యారు.

వీరుల్లా పోరాడి ఓడిపోవడం బాధను కలిగించదు.మరోసారి వీరత్వంతో పోరాడాలి అన్నట్లుగా ఆయన కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ధైర్యం నింపాడు.

ఆయన మాటలు ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.ఇలాంటి నాయకుడు మనకు కావాలి అంటూ చాలా మంది ఆయన్ను టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నారు.

తాజా వార్తలు