పైల్స్‌ను నివారించే దానిమ్మ తొక్క‌లు.. ఎలా వాడాలంటే?

Pomegranate Peels To Prevent Piles! Pomegranate Peels, Piles, Latest News, Health Tips, Good Health, Health, Benefits Of Pomegranate Peels, Pomegranate,

పైల్స్ లేదా మొల‌లు లేదా హెమరాయిడ్స్.ఇలా ఎన్ని పేర్లు ఉన్నా స‌మ‌స్య ఒక్క‌టే.

 Pomegranate Peels To Prevent Piles! Pomegranate Peels, Piles, Latest News, Healt-TeluguStop.com

నేటి కాలంలో చాలా మందిని ఈ పైల్స్ స‌మ‌స్య వేధిస్తోంది.పైల్స్ స‌మ‌స్య ఉంటే.

మలవిసర్జన సమయంలో నొప్పి, రక్తస్రావం, మలద్వారం చుట్టూ వాచిపోవడం ఇలా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ఇక ఇలాంటి వారు ఒకచోట కూర్చోలేరు, నిలుచోలేరు.

అలాగే ఈ పైల్స్ స‌మ‌స్య ఉన్న వారు పైకి చెప్పుకోలేక‌.లోలోనే భాద‌ను అనుభ‌విస్తూ తీవ్రంగా కృంగిపోతుంటారు.

కానీ, ఇలా చేయ‌డం ఆరోగ్యానికే ముప్పుగా మారుతుంది.వాస్త‌వానికి వైద్యప‌రంగా కాకుండా.న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తిలోనూ పైల్స్ స‌మ‌స్య‌ను నివారించవచ్చు.ముఖ్యంగా దానిమ్మ తొక్క‌లు పైల్స్ స‌మ‌స్య‌ను నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే.దానిమ్మ తొక్క‌ల‌తోనే పైల్స్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

దానిమ్మ గింజ‌ల్లోనే కాదు.తొక్క‌ల్లో కూడా ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి.

విట‌మిన్ సి, విట‌మిన్ బి, విటమిన్ ఎ, ఐర‌న్‌, కాల్షియం, మెగ్నీషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్ వంటి ల‌క్ష‌ణాలు కూడా దానిమ్మ తొక్క‌ల్లో పుష్క‌లంగా ఉన్నాయి.మ‌రి ఇన్ని పోష‌కాలు ఉన్న దానిమ్మ తొక్క‌ల‌ను పైల్స్ నివార‌ణ‌కు ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా దానిమ్మ తొక్కుల‌ను బాగా ఎండ‌బెట్టుకుని పొడి చేసుకోవాలి.ఆ దానిమ్మ తొక్క‌ల పొడిలో కొద్దిగా బెల్లం వేసి.మ‌ళ్లీ మిక్సీ ప‌ట్టుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకుని.

ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం తీసుకుంటుంటే పైల్స్ స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.ఇక ఆడ‌వారికి కూడా దానిమ్మ తొక్క‌లు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ముఖ్యంగా నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పులను నివారించుకోవాలంటే.దానిమ్మ తొక్క‌ల‌ను బాగా ఎండ‌బెట్టి పొడి చేసి.

నిల్వ చేసుకోవాలి.నెల‌స‌రి స‌మ‌యంలో ఒక గ్లాస్ నీటితో ఒక స్పూన్ దానిమ్మ తొక్క‌ల పొడి క‌లిపి సేవిస్తే.

ఎలాంటి నొప్పులైనా మాయం అవుతాయి.

Video : Pomegranate Peels To Prevent Piles! Pomegranate Peels, Piles, Latest News, Health Tips, Good Health, Health, Benefits Of Pomegranate Peels, Pomegranate,

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube