పిల్లల్లో తెలివి తగ్గడానికి అది కూడా కారణం

ఓ వయసుకి వచ్చాక, రకరకాల బరువు బాధ్యతలు మనిషి మీద పడతాయి.పని ఒత్తిడి వలనో, ఇతర కారణాల వలనో ప్రతీ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టమైపోతుంది.

 Polluted Air Affecting Brain Development In Children-TeluguStop.com

పెద్దవారి జ్ఞాపకశక్తి, తెలివితేటలు తగ్గిపోతూ ఉంటే అదో అర్థం, ఎందుకంటే వయసు పైబడినా కొద్ది జరిగేదే అది.కాని పిల్లల్లో కూడా జ్ఞాపకశక్తి తగ్గటం, మతిమరుపు పెరగటం, తెలివిగా, చురుకుగా ఆలోచించలేకపోవడానికి కారణాలేంటి ? దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి.అయితే ఊహించని విధంగా కలుషితమైన గాలి పీల్చడం వలన కూడా పిల్లల మెదడులో చురుకుదనం, జ్ఞాపకశక్తి తగ్గుతోందట.

” పల్లెటూరి వాతావరణంలో కాలుష్యం తక్కువ.అందుకే పట్టణాల్లో ఉంటున్న పిల్లలతో పోలిస్తే, పల్లెటూరి పిల్లల్లో జ్ఞాపకశక్తి, చురుకుదనం 4-5% ఎక్కువే ఉంటుంది.సీటీల్లో పెరుగుతున్న పిల్లలు రోజూ కలుషితమైన గాలి పీల్చుకుంటూ బ్రతుకుతున్నారు.

పిల్లలని మనం కాపాడుకోవాలి.ఎందుకంటే వారు వయసులో ఉన్నవారి కంటే ఎక్కువ గాలి శరీరంలోకి తీసుకుంటారు.

ట్రాఫిక్ లో వాహనాల నుంచి వెలువడే పొగ, ఫ్యాక్టరీలు, టొబాకో .ఇలా ప్రతిరోజూ ప్రమాదకరమైన వస్తువుల నుంచి మార్గాల నుంచి కలుషితమైన గాలి పిల్లల మెదడుని బలహీనపరుస్తోంది.అలాగని ఇంట్లో ఇలాంటి ప్రమాదం లేదని కాదు.ఇంట్లో వాల్ పేయింట్, టాయ్ పేయింట్, స్టోవ్ నుంచి వెలువడే గ్యాస్ కూడా గాలిని కలుషితం చేస్తున్నాయి.దీనికి పరిష్కార మార్గాలు వెతకాల్సిందే” అంటూ ఇటివలే ఢీల్లీలో జరిగిన వాతావరణం – కాలుష్యం సదస్సులో డాక్టర్ బ్యోత్రా వాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube