డిస్పోజబుల్ ఫేస్ మాస్కులతో కొత్త చిక్కు: అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర విషయాలు

ఏ ముహూర్తాన ఈ భూమిపై కరోనా వైరస్ అడుగుపెట్టిందో కానీ ఈ మహమ్మారి మానవ జీవన శైలిలో సరికొత్త మార్పులను తీసుకొచ్చింది.వీటిలో ముఖ్యమైనది ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించడం.

 Pollutants And Nanoplastics Found In Disposable Face Masks-TeluguStop.com

రెండేళ్ల క్రితం వరకు కూడా మాస్క్‌లను డాక్టర్లు, కొన్ని రంగాల్లో పనిచేసే వారు మాత్రమే పెట్టుకునే వారు.కానీ మహమ్మారి విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశాయి.

ఇంట్లో నుంచి అడుగు బయటపడితే మాస్క్ ఉండాల్సిందేనని లేని పక్షంలో జరిమానాలు విధిస్తామని, అవసరమైతే జైలుకు కూడా పంపుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 Pollutants And Nanoplastics Found In Disposable Face Masks-డిస్పోజబుల్ ఫేస్ మాస్కులతో కొత్త చిక్కు: అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర విషయాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే, ఫేస్ మాస్క్‌ల వినియోగంపై కొత్త కొత్త సర్వేలు, అధ్యయనాలు ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి.

వీటిని అధికంగా వాడితే శరీరంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగి, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని ప్రచారం జరుగుతుంది.వీటికి తోడు కరోనా స్పీడుకు బ్రేకులు వేయాలంటే ఒక్క మాస్క్‌ పెట్టుకుంటే సరిపోదని.

డబుల్ మాస్క్ పెట్టుకోవాల్సిందేనన్నది లేటెస్ట్ సర్వే.మాస్క్‌ ధరించడంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా హెల్త్‌ కేర్‌ జరిపిన అధ్యయనంలో ఈ ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.

డబుల్‌ మాస్క్‌ ధరించడం వల్ల వైరస్‌ దరిచేరకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మాస్క్‌లను పలు రకాలుగా పరీక్షించి జరిపిన ఈ అధ్యయన ఫలితాలు జేఏఎంఏ ఇంటర్నల్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

తాజాగా మరో అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది.డిస్పోజబుల్ ఫేస్ మాస్క్‌ల వల్ల పర్యావరణానికి కొత్త చిక్కులు ఎదురవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వీటిలో ప్రమాదకర కారకాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు.ఈ డిస్పోజబుల్ మాస్క్‌లను నీటిలో ముంచినప్పుడు హానికరమైన కాలుష్య కారకాలున్నట్లు అమెరికాలోని స్వాన్సీయా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.డిస్పోజబుల్ ఫేస్ మాస్క్‌లు తయారీకి సిలికాన్ , ప్లాస్టిక్ ఫైబర్‌లలో సీసం, యాంటిమోనీ , రాగి సహా అధిక స్థాయిలో రసాయనాలను వినియోగిస్తున్నట్లు పరిశోధనలో తేలింది.

ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్నోవేటివ్ మెటీరియల్స్, ప్రాసెసింగ్ అండ్ న్యూమరికల్ టెక్నాలజీస్ (ఇంపాక్ట్) ,స్పెసిఫిక్ ఇన్నోవేషన్ అండ్ నాలెడ్జ్ సెంటర్ల సహకారంతో స్వాన్సీయా వర్సిటీ ఈ ప్రాజెక్ట్ చేపట్టింది.కరోనా దరిచేరకుండా వుండాలంటే మాస్క్ ధరించాల్సిందేనని అయితే.ఈ మాస్కు‌ల తయారీపై పరిశోధన చేయాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

మనిషి ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని గురించి కూడా కాస్త పట్టించుకోవాలని పరిశోధకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

#AccordingTo #FaceMask #PollutantsAnd #COvid #Face Masks

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు