ఉపాధ్యక్షురాలిగా ఆరు నెలలు: కమలా హారీస్‌ పనితీరుపై అమెరికన్ల అసంతృప్తి.. రెండు సర్వేల్లోనూ ఇదే రిజల్ట్

కోట్లాది మంది భారతీయుల కలలు , ఆకాంక్షలను నెరవేరుస్తూ కమలా హారీస్ అగ్రరాజ్యం అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.తద్వారా అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి దక్షిణాసియా వాసిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.

 Polls Suggest Kamala Harris Least Popular Vice President Since 1970s, Kamala Har-TeluguStop.com

అయితే వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి ఇటీవలే ఆరు నెలల కాలాన్ని పూర్తి చేసుకున్నారు కమలా హారీస్.మరి ఈకాలంలో ఆమె అమెరికన్లను సంతృప్తి పరచారా.? మెజారిటీ ప్రజలు కమలా హారిస్‌ పనితీరును ఎలా చూస్తున్నారన్న దానిపై కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించాయి.అయితే వీటిలో ఆమెకు సంతృప్తికరమైన ఫలితాలు రాలేదు.

అంతర్జాతీయ మీడియా దిగ్గజం టెలిగ్రాఫ్ నిర్వహించిన సర్వేలో ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ పని తీరు అస్సలు బాగోలేదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు.తాజాగా జరిగిన రెండు సర్వేల్లోనూ 46 శాతం మంది ప్రజలు మాత్రమే వైఎస్ ప్రెసిడెంట్‌గా కమలా హారిస్ పనితీరును మెచ్చుకున్నట్టు తేలింది.

దాదాపు 48 శాతం మంది ప్రజలు ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట.దీంతో 1970 తర్వాత బాధ్యతలు స్వీకరించిన తొలి ఆరునెలల్లోనే తక్కువ ప్రజాదరణ పొందిన ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ నిలిచారని అక్కడి మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి.ఇదే సమయంలో అధ్యక్షుడిగా జో బైడెన్ పనితీరు బాగుందని 51.3శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారట.సుమారు 44.9 శాతం మంది ప్రజలు బైడెన్ పనితీరుపట్ల పెదవి విరిచారట.మిగిలిన ప్రజలు తటస్థంగా వున్నట్లు సర్వేలో వెల్లడైంది.

కమలా హారిస్ ప్రస్థానం:

కమలా హారిస్‌ 1964 అక్టోబరు 20న కాలిఫోర్నియాలో జన్మించారు.ఆమె తల్లిదండ్రులు శ్యామలా గోపాలన్‌, డొనాల్డ్‌ హారిస్‌.చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్‌ న్యూట్రిషన్‌, ఎండోక్రినాలజీలో పరిశోధన నిమిత్తం అమెరికా వెళ్లారు.యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో జమైకాకు చెందిన డొనాల్డ్‌ హారీ‌స్‌తో ఆమెకు పరిచయమై ప్రేమగా మారి అది కాస్తా పెళ్లికి దారితీసింది.కమల తాతయ్య పీవీ గోపాలన్‌ భారత స్వాతంత్య్ర సమరయోధుడు.

చిన్నతనంలో తరచూ చెన్నై రావడంతో కమలపై తాతగారి ప్రభావం పడింది.ఆమె 2014లో డగ్లస్‌‌ను పెళ్లి చేసుకున్నారు.

Telugu Calinia, Calinia General, Donald Harris, Joe Biden, Kamala Harris, Peevi

1986లో హోవార్డ్‌ వర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ అందుకున్న కమలా హారిస్.హేస్టింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.అనంతరం రాజకీయాలపై అభిరుచితో డెమోక్రటిక్‌ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు.2003లో శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా ఎన్నికై.ఆ పదవి చేపట్టిన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా రికార్డుల్లోకెక్కారు.2011-17 మధ్య కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు.ఇక 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌ ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube