'ట్రంప్ తీరు'కి దిమ్మతిరిగే....'ప్రజా తీర్పు'     2018-11-08   14:31:57  IST  Surya Krishna

అమెరికా తిక్క అధ్యక్షుడు ట్రంప్ కి ఆ దేశ ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు. అధ్యక్షుడు పాలనకి రెఫరెండం గా భావిస్తున్న మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు ట్రంప్ కి బిగ్ షాక్ ఇచ్చారు..ఏది జరుగుతుంది అనుకున్నారో అదే జరిగింది…ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీకి ప్రజలు జై కొట్టారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో 218 సీట్లతో డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించింది.

Polls Against Donald Trump In America-

Polls Against Donald Trump In America

ఈ పోరులో రిపబ్లికన్లు కేవలం 193 స్థానాలకి మాత్రమే పరిమితమయ్యారు. మరోవైపు సెనెట్‌లో మాత్రం రిపబ్లికన్ల హవా కొనసాగింది. ఎన్నికలు 35 స్థానాలకు జరుగగా 26 స్థానాల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది..అయితే ఈ ఫలితాలు మాత్రం ట్రంప్ కి కోలుకోలేని దెబ్బే అంటున్నారు విశ్లేషకులు..ఇమ్మిగ్రేషన్స్ పై ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, అడ్డగోలు నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయినట్లుగా తెలుస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Polls Against Donald Trump In America-

ట్రంప్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలకి ఈ ఎన్నికలతో చెక్ పడతాయని భావిస్తున్నారు పరిశీలకులు. ఇకపై కీలక నిర్ణయాలు తీసుకోవడంలో డెమొక్రాట్ల ఆమోదం లేకుండా ట్రంప్ ముందుకెళ్లే పరిస్థితి లేదని..ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే ప్రజా ఆమోదం లేకపోతే డెమోక్రాట్లు అడ్డు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.